కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును, వైద్యాధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లతో…
నల్లగొండ పట్టణాభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. రాష్ట్రంలోని అన్ని పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా అభివృద్ధి చెందాలని.. నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని.. ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడబోదని వెల్లడించారు.. నల్లగొండను అన్ని హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలని ఆదేశించిన కేసీఆర్.. అభివృద్ధికి ప్రభుత్వం సరిపడా నిధులు ఇస్తుందని.. ఇందుకు తక్షణమే కార్యాచరణకు పూనుకోవాలని స్పష్టం చేశారు.. నల్లగొండ పట్టణ అభివృద్ధి కోసం, అణువణువూ…
తెలంగాణలో వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు సీఎం కేసీఆర్.. దీనిలో భాగంగా.. సర్వే కంపెనీలతో చర్చలు కూడా జరిపారు సీఎస్ సోమేష్‌కుమార్.. ఇవాళ సీఎం కేసీఆర్ వారితో సమావేశమయ్యారు. డిజిటల్ సర్వేపై కీలక ఆదేశాలు జారీ చేశారు.. సర్వేలో భాగంగా ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలన్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని, అందులో 3 గ్రామాలను గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎంపిక చేయాలని, మిగతా…