సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ చొరవతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య భారీగా పెరిగింగి.. ఏకంగా న్యాయమూర్తుల సంఖ్య 75 శాతం పెంచారు.. దీంతో.. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెరిగింది. న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు నుంచి గత రెండేళ్లుగా సుప్రీంకోర్టుకు అనేక విజ్ఞప్తులు అందగా.. దీనికి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేదు.. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం సుప్రీంకోర్టు కొలీజియం ద్వారా జరుగుతుండగా.. వివిధ రాష్ట్రాల హైకోర్టుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను జస్టిస్ ఎన్వీరమణ పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఏకంగా 75 శాతం వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.. తెలంగాణ హైకోర్టు విజ్ఞప్తిని మన్నించిన భారత ప్రధాన న్యాయమూర్తి.. న్యాయమూర్తుల సంఖ్యను పెంచారు.. దీంతో.. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న కేసులు మరింత వేగంగా ముందుకు కదిలే అవకాశం ఉంది.