Shilpa Shetty : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. అప్పట్లో అశ్లీల చిత్రాల కేసులో ఇరుక్కున్నారు శిల్పాశెట్టి దంపతులు. ఇక రీసెంట్ గా ఓ బిజినెస్ పర్సన్ ను రూ.60 కోట్ల మేర చీటింగ్ చేశారంటూ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో మొన్న శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను విచారించారు. తాజాగా హీరోయిన్ శిల్పాశెట్టి కూడా ముంబై పోలీసుల ముందు విచారణకు హాజరైంది. ఆమెను పోలీసులు…
Karimnagar Loan Scam: అప్పు పుట్టాలంటే.. ఆస్తులు తాకట్టు పెట్టాలి. అంతే కాదు.. బ్యాంకులు అడిగిన అన్ని డాక్యుమెంట్లు సమర్పించాలి. లక్షల్లో లోన్ కావాలంటే సవాలక్ష ప్రశ్నలు అడుగుతారు. దీంతో బ్యాంకుల చుట్టూ లోన్స్ కోసం తిరిగే వారు.. ఆయా అధికారులు చెప్పే కండీషన్స్ ఫుల్ ఫిల్ చేయలేక.. తర్వాత రుణాలు రాక.. ఏదైనా పని చేసుకుందామంటే చేతిలో డబ్బులు లేక దిక్కులు చూస్తుంటారు. సరిగ్గా అలాంటి వాళ్లను టార్గెట్ చేశాడు దోమల రమేష్ అనే వ్యక్తి.…
Fraud : అమాయకులకు మాయ మాటలు చెప్పి వర్క్ వీసాకు బదులుగా విసిటింగ్ వీసాలు ఇప్పించి మోసాలకు పాల్పడుతున్న సత్యనారాయణ అనే వ్యక్తిపై ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన లంకపల్లి మేరీ అనే మహిళకు వర్క్ వీసాకు బదులుగా విసిటింగ్ వీసా ఇప్పించాడు అకుమర్తి సత్యనారాయణ. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న లంకపల్లి మేరీతో పాటు కొండలమ్మను ఇమిగ్రేషన్ అధికారులు చెకింగ్ చేయడంతో వారు వర్క్ వీసాకు…
Marri Rajashekar Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, ప్రస్తుత మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. యేసుబాబు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదయ్యింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. యేసుబాబు ఫిర్యాదు ప్రకారం “విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్” సంస్థ ద్వారా ఆయన అరుంధతి హాస్పిటల్‌కు సిబ్బంది సమకూర్చినట్లు పేర్కొన్నారు. మొత్తం 40 మంది సిబ్బందిని అందించగా.. అందుకు గాను రూ.50 లక్షలు చెల్లిస్తామని రాజశేఖర్…
Fraud : నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తిలో అధిక వడ్డీల పేరుతో మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అమాయక ప్రజలను మోసం చేసిన కల్వకుర్తికి చెందిన ముజమ్మిల్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. కోట్ల రూపాయలతో పరారయ్యాడు నిందితుడు. అమాయక ప్రజలను అధిక వడ్డీ ఇస్తానని ఆకర్షించిన ముజమ్మిల్.. 2020లో ఆర్ సి ఇన్ఫ్రా, ట్రై కాలర్ పేరుతో వెంచర్లు పెట్టి అధిక వడ్డీ ఇస్తానని వ్యాపారం ప్రారంభించాడు. 24 మంది ఏజెంట్లతో…
Nitya Pellikoduku : మాయ మాటలు చెప్పి యువతులను వల్లో వేసుకుని ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ కేటుగాడి బాగోతం తాజాగా బయటపడింది. ఈ వ్యక్తి బండారం రెండో భార్య లీలావతి గుర్తించడంతో జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. కేసు వివరాలు: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్‌నగర్ గబ్బిబాల్‌పేట్ ప్రాంతానికి చెందిన లక్ష్మణరావు (34) ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2014లో బంధువుల…
Uttar Pradesh: 8వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి, తాను ఆర్మీ కెప్టెన్ అని నమ్మిస్తూ ఏకంగా 20 మది మహిళల్ని మోసం చేశాడు. మహిళలతో రిలేషన్ పెట్టుకుని, ఆ తర్వాత డబ్బుతో ఉడాయించే వాడు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాకు చెందిన హైదర్, తనను తాను హిందువుగా, ఆర్మీ ఆఫీసర్‌గా పరిచయం చేసుకుని మహిళల్ని మోసం చేస్తున్నాడు. నిందితుడు 40 ఏళ్ల హైదర్‌ని లక్నోలో అరెస్ట్ చేశారు.
Ex Minister Harish Rao: బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు బంధువులపై కేసు నమోదైంది. హరీశ్‌రావు తమ్ముడు మరదలు, మేనమాలు, మరో ముగ్గురిపై మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు బాధితులు.
Alla Nani: ఏలూరులో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానితో పాటు మరికొందరిపై త్రీటౌన్ పోలీసు స్టేషన్లో ఛీటింగ్ కేసు నమోదైంది. ఇటీవల సార్వత్రిక ఎన్ని కల సమయంలో శాంతినగర్ లక్ష్మీకృష్ణ రెసిడెన్సీ అపార్టుమెంట్లో వైసీపీ నాయకుడు దిరిశాల వరప్రసాద్ తదితరులతో కలిసి శాంతినగర్ కు చెందిన అవుటుపల్లి నాగమణి ప్రచారంలో పాల్గొన్నారు.