కరోనా బాధిత కుటుంబాలకు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… పేద ప్రజల కోసం మే, జూన్ మాసాలకు ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున కేంద్రం ఉచిత బియ్యం ఇస్తుంది. ప్రజల అవసరాల మేరకు అవసరమైతే పొడిగించాలని కేంద్రం ఆలోచిస్తుంది. భాజపా అధ్యక్షుడు నడ్డా పిలుపు మేరకు సేవా హి సంఘటన పేరుతో పార్టీ శ్రేణులు అనేక సేవా కార్యక్రమాలు చేశాయి. దేశ వ్యాప్తంగా మాస్కులు, ఇమ్యూనిటీ పెంచే ఆహారాన్ని భాజపా శ్రేణులు పంపిణీ చేశాయి. లాక్ డౌన్ ముగిసే వరకు కరోనా బాధిత కుటుంబాలు, పేదలకు ఉచితంగా యువ మోర్ఛా ఆధ్వర్యంలో ఆహారాన్ని పంపిణీ చేస్తారు. తెలంగాణలోని 46 ఆసుపత్రులకు కేంద్రం పీఎంకేర్ నిధులతో 1,405 వెంటిలేటర్స్ కొనుగోలు చేసి పంపించాము. వెంటిలేటర్స్ నిర్వహణ కోసం అనుభవజ్ఞులైన సిబ్బందిని తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసారు.
ఇక ఆసుపత్రులకు కావాల్సిన వైద్య సిబ్బందిని తక్షణమే నియమించాలి… ప్రాణాలకు తెగించి పని చేస్తున్న వైద్య సిబ్బందికి ఇన్సెటివ్ ఇవ్వాలి అని పేర్కొన్నారు. వారం రోజులుగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చేయడం లేదు. ప్రభుత్వం వ్యాక్సినేషన్ నిలిపివేయడంతో రెండో డోస్ వేసుకునే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ పట్టింపులకు పోకుండా రెండో డోస్ వేసుకునే వారికి వ్యాక్సిన్ ఇవ్వాలి అని తెలిపారు.