Fake IPS Case: నకిలీ ఐపీఎస్ కేసులో మరో నలుగురికి నోటీసులు ఇచ్చింది సీబీఐ.హైదరాబాద్ చెందిన నలుగురు వ్యాపారవేత్తలకు నోటీసులు ఇచ్చిన సీబీఐ నోటీసులు ఇచ్చింది. రేపు సీబీఐ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. యూసుఫ్ గూడా చెందిన మేలపాటి చెంచు నాయుడు, హైదరాబాద్ చెందిన వ్యాపారవేత్త వెంకటేశ్వరరావు, సనత్ నగర్ కు చెందిన రవికి నోటీసులు ఇచ్చింది. సీబీఐలో ఉన్న కేసుకు సంబంధించి సెటిల్మెంట్ చేస్తానని, సీబీఐ ఢిల్లీలో వెంకటేశ్వరరావు కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని, ఢిల్లీలో పగటిపూట లారీలు తిరిగేందుకు అనుమతిప్పిస్తానని రవి నుంచి శ్రీనివాస్ డబ్బులు వసూలు చేశారనే విచారణలో తెలుపడంతో వీరందరికి నోటీసులు జారీ చేసింది సీబీఐ. అది నమ్మిన వ్యాపార వేత్తలు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. డబ్బులతో పాటు పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు ఇచ్చినట్లు విచారణలో శ్రీనివాస్ తెలిపినట్లు సమాచారం. వైజాగ్ లో వాల్తేర్ ప్రాంతంలో అపార్ట్మెంట్ లో శ్రీనివాస్ నివాసముంటున్నట్లు అధికారులు గుర్తించారు. వైజాగ్ లో వ్యాపార వేత్త పేరుతో మోసాలకు పాల్పడ్డారని అధికారుల తెలిపారు.
Read also: Sapota Nutrition Facts : సపోటా పండు తింటే ఇన్ని లాభాలా..?
ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్ర నేడు ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్లో విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే సీబీఐ అధికారులు గంగుల కమలాకర్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఢిల్లీకి రావాలని ఆదేశించారు. విశాఖ పట్నం చిన్నవాల్తేర్ కు చెందిన కొవ్విరెడ్డి శ్రీనివాస్ రావు ఫేక్ సీబీఐ అధికారిగా చెలామణీ అవుతూ వివిధ వ్యక్తుల నుంచి డబ్బును స్వీకరించాడు. ఈ నకిలీ సిబిఐ అధికారిని ఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసింది. నిందితుడికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగంలో మంచి పరిచయాలున్నట్లు సమాచారం. సీబీఐ పేరుతో అతను కోట్ల రూపాయల డీల్‌లు చేసినట్లు వస్తున్న ఆరోపణలపై కూడా సిబిఐ దృష్టి సారించింది.
Hyderabad : టీబీపై యుద్ధం.. రోగుల సమాచారం ఇస్తే ఖరీదైన బహుమతి