మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరుకావాంటూ సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నేడు సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రానున్నారు. అవినాష్ రెడ్డికి అడిగే ప్రశ్నలు ఏంటి ఎంతటైం ప్రశ్నిస్తారు.. మళ్లీ వస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
హైదరాబాద్ చెందిన నలుగురు వ్యాపారవేత్తలకు నోటీసులు ఇచ్చిన సీబీఐ నోటీసులు ఇచ్చింది. రేపు సీబీఐ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. యూసుఫ్ గూడా చెందిన మేలపాటి చెంచు నాయుడు, హైదరాబాద్ చెందిన వ్యాపారవేత్త వెంకటేశ్వరరావు, సనత్ నగర్ కు చెందిన రవికి నోటీసులు ఇచ్చింది.
మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నోటీసు ఇచ్చింది. ఢిల్లీలో అరెస్ట్ అయిన శ్రీనివాస్ వ్యవహారంలో నోటీసులో పేర్కొంది. మూడు రోజుల క్రితం ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో సీబీఐ శ్రీనివాసుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ ని సీబీఐ అరెస్ట్ చేసింది.