Car accident in Hayat Nagar: హయత్ నగర్ లో శనివారం నిర్ఘాంత పోయే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువతులు రహదారి దాటుతుండగా అతివేగంగా కారు ఢీకొట్టిన ఘటన రాష్ట్ర ప్రజలు ఉలిక్కిపడేలా చేసింది. రోడ్డు ప్రమాదంలో ఆయువతులు ఒక్కసారిగి ఎగిసిపడి పక్కన పడిపోయిన సీసీ కెమెరా దృష్యాలు షాక్ గురియ్యేలా చేశాయి. కారు ఢీ కొన్న ఘటన శనివారం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read also: Madras Eye Effect: తమిళనాడుని వణికిస్తున్న మద్రాస్ ఐ.. లక్షణాలేంటో తెలుసా?
హైదరాబాద్ -హయత్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి రోడ్డు దాటుతున్న ఇద్దరు యువతులను కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈఘటనలో ఓ యువతి మృతిచెందగా మరో యువతికి తీవ్రగాయాలయ్యాయి. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేరళకు చెందిన నివేదిత సూరజ్, సోనాలీ హయత్నగర్ ఉంటూ ఓ న్యూస్ ఛానెల్లో కంటెంట్ రైటర్లుగా పని చేస్తున్నారు. ఉద్యోగానికి వెళ్లేందుకు ఇద్దరు జాతీయ రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టగా నివేదిత అక్కడికక్కడే చనిపోయింది. మరో యవతికి తీవ్ర గాయాలయ్యాయి. సీసీ పొటేజ్ ఆధారంగా ఆ ఇద్దరి యువతులు రోడ్డు దాటడానికి ఒకరినొకరు చేయి పట్టుకుని దాటే క్రమంలో వారి ముందు నుంచి లారీ వెళ్లింది. ఆ తరువాత కొంత దూరంలో స్పీడ్ కారు వస్తుందని గుమనించిన యువతులు రోడ్డు దాటడానికి ప్రయత్నించారు. అయితే రోడ్డు దాటుతున్న క్రమంలో కారు ఆయువతులని క్రాస్ చేయడానికి ప్రయత్నించినా ఆ యువతులు మళ్లీ వెనుక రావడంతో వారిని ఢీకొట్టింది. దీంతో ఆయువతులు ఎగిసిపడి కింత పడ్డారు. ఓయువతి అక్కడిక్కడే మృతిచెందగా.. మరొక యువతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారాలు పరిశీలిస్తున్నారు.
Jahnavi Kapoor: తళుక్కుమని మెరిసిపోతున్న అతిలోకసుందరి తనయ