విశాఖలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. బ్రేక్స్ ఫెయిల్ కావడంతో లారీ ఓ షాపులోకి దూసుకెళ్లింది. గాజవాక సుందరయ్య కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వెంకట రమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఓయువతి తప్పించుకుంది.
Land Slide: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడే సంఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్‌కు కూడా భారీగా అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా, సోన్‌ప్రయాగ్ – గౌరీకుండ్ మధ్య కొండపై నుండి శిధిలాలు పడటంతో ఒకరు మరణించారు. అలాగే ఇద్దరు గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. Triphala Churnam: త్రిఫల చూర్ణం అంటే అంటి.. ఎందుకు వాడుతారంటే.. జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్…
దేశ రాజధాని ఢిల్లీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం జహంగీర్‌పురి పారిశ్రామిక ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఐదు అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఇతర సివిల్ ఏజెన్సీ ఉద్యోగుల సహాయంతో శిథిలాలను తొలగించడం ప్రారంభించారు. శిథిలాల నుంచి నలుగురిని బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
హయత్ నగర్ లో శనివారం నిర్ఘాంత పోయే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువతులు రహదారి దాటుతుండగా అతివేగంగా కారు ఢీకొట్టిన ఘటన రాష్ట్ర ప్రజలు ఉలిక్కిపడేలా చేసింది. రోడ్డు ప్రమాదంలో ఆయువతులు ఒక్కసారిగి ఎగిసిపడి పక్కన పడిపోయిన సీసీ కెమెరా దృష్యాలు షాక్ గురియ్యేలా చేశాయి.