Gorantla Madhav: ఏపీలో వైసీపీ నేతలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయని వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. నోటీసులు, అక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.. వైఎస్ జగన్ ని కట్డడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుక మందమంటూ చంద్రబాబు గర్వంగా, అహంకారంగా వ్యవహరిస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లాస్థాయి సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. బాబుకు మోసం తప్ప చిత్తశుద్ధి తెలియదని విమర్శించారు. అక్రమ కేసులు పెట్టి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
పోలీసు వేధింపులకు దేశంలోనే నిలువుటద్దంలా ఏపీ నిలుస్తుందని.. కస్టోడియల్ టార్చర్ కి ఏపీ పోలీస్ స్టేషన్ లు వేదికలుగా మారిపోతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. గతంలో సోనియాతో కలసి జగన్ ను 16 నెలలు జైలులో ఉంచేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు.. లిక్కర్ కేసులో బెయిలుపై బయట తిరుగుతున్న చంద్రబాబు.. లేని లిక్కర్ కేసు సృష్టించారని విమర్శించారు.