హుజురాబాద్ బైపోల్.. రేపే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్‌లో ఉప ఎన్నికల వాతావరణం హీటెక్కిస్తోంది… ఇప్పటికే అధికార పార్టీకి చెందిన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయగా… మరో రెండు ప్రధాన పార్టీలు కూడా రంగంలోకి దిగాయి… బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బలమూరి వెంకట్ రేపే నామినేషన్ దాఖలు చేయనున్నారు.. రేపు ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు నేతలు, బీజేపీ శ్రేణులు హాజరుకానున్నారు. ఈటల రాజేందర్ సిట్టింగ్ స్థానం కావడంతో.. బీజేపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది.
ఇక, కాంగ్రెస్ అభ్యర్థిగా బలమూరి వెంకట్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు హుజురాబాద్ పట్టణంలో నామినేషన్ దాఖలు చేస్తారని ప్రకటించారు టి.పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్… ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్ లతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, చైర్మన్ లు, డీసీసీ అధ్యక్షులు పాల్గొంటారని తెలిపారు. మరోవైపు.. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలోకి దిగాయి.. అధికార టీఆర్‌ఎస్ పార్టీ.. మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపగా.. టీఆర్‌ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఈటల ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం సాగిస్తున్నారు.. పార్టీ ఇంచార్జ్‌లు, ఎమ్మెల్యేలు, నేతలు ఆయన తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక, అభ్యర్థిని కాస్త లేట్‌గా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. మొత్తంగా హుజురాబాద్‌లో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది.
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
తాజావార్తలు
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
-
Yashpal Sharma: 1983 ప్రపంచకప్‌లో అసలైన సూపర్‌మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
ట్రెండింగ్
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!