AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Body Elections 2026: స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా సమావేశం నిర్వహించారు. మొత్తం 20 రాజకీయ పార్టీలకు ఆహ్వానం అందించగా, 19 పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికలను పారదర్శకంగా, చట్ట ప్రకారం నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివిధ రాజకీయ పార్టీలు తమ సూచనలు, అభిప్రాయాలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో కుల ధృవీకరణ పత్రాలు, నో డ్యూ సర్టిఫికెట్ల జారీ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు. ఎన్నికల సమయంలో మద్యం నియంత్రణను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. అలాగే, దసరా ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల నిర్వహణకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు.. రాజకీయ పార్టీలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఈ అంశాలపై సంబంధిత జిల్లాల అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల విధానాలను తక్షణమే మార్చడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే, కలెక్టరేట్లో నామినేషన్ల స్వీకరణ అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. సంబంధిత శాఖల నుంచి గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసే అంశంపైనా ఆలోచిస్తామని తెలిపారు.
Also Read
దసరా ఉత్సవాల నేపథ్యంలో ఎలాంటి ఎన్నికల సంబంధిత కార్యక్రమాలు చేపట్టకుండా ఉండే అంశాన్ని కూడా పరిశీలిస్తామని ఎస్ఈసీ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో సున్నిత ప్రాంతాలు, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ఎన్నికల భద్రత కోసం పారామిలిటరీ దళాల మోహరింపు అంశాన్ని పోలీసు శాఖకు పంపినట్లు వెల్లడించారు. ఇక, రాజకీయ పార్టీలు చేసిన సూచనలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
New Zealand Series: టీమిండియాకు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్ ఆడటం కష్టమే..!
-
Dada: రక్తపాతం లేని రచ్చ.. బాలయ్య వర్సెస్ మనోజ్ ‘దాదా’ వార్!
-
Team India: టీమిండియా జట్టులోకి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. కెప్టెన్‌గా తిలక్ వర్మ..
-
Sivakarthikeyan: డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన హీరో.. సర్ప్రైజ్ మామూలుగా లేదుగా!
-
Tollywood: ఒకే ఒక్క ఫ్లాప్.. ప్రశ్నార్థకంగా మారిన స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!