Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy: ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక భేటీ కొనసాగింది. ఈ భేటీ సందర్భంగా తెలంగాణలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై మంత్రి చర్చించారు. ఎల్బీనగర్ – హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్రమంత్రి ఆమోదం తెలిపారు. కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన ప్రతిపాదనకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం వల్ల NH 167kపై తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ అనుసంధానం జరిగి, రవాణా వ్యవస్థ, పర్యాటకం మెరుగుపడనుంది.
ఇక, హైదరాబాద్ – శ్రీశైలం NH 765పై ఎలివేటెడ్ కారిడార్ విజ్ఞప్తిపై నూతన డీపీఆర్ సిద్ధం చేయాలని కేంద్రమంత్రి అధికారులను ఆదేశించారు. పర్వతమాల పథకం ద్వారా తెలంగాణకు 5 రోప్ వేలకు సై అన్నారు. హైదరాబాద్ – అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేపై సానుకూలంగా స్పందించారు. సేతు బంధన్ పథకం ద్వారా 3 ఆర్ఓబిలకు ఆమోదం తెలిపారు. తెలంగాణలో 34 పనులకు సీఆర్ఐఎఫ్ (CRIF) నిధులను మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి కోరగా ఓకే చెప్పేశారు. పుల్లూరు – అలంపూర్ – జట్రపోలు – పెంట్లవెల్లి – కొల్లాపూర్ – లింగాల – అచ్చంపేట – డిండి – దేవరకొండ – మల్లేపల్లి – నల్గొండ రాష్ట్ర హైవేలను జాతీయ హైవేలుగా మార్చాలనే డిమాండ్‌పై గడ్కరీ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్‌లో నవంబర్ 19-22 వరకు జరగనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్(IRC)కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆహ్వానించగా వస్తానని తెలిపారు.
Also Read
- Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
- ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!