Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Graduate Voter Registration: గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదు కావడానికి ఎపిక్ (EPIC) నంబర్ వివరాలు తప్పనిసరి కాదని స్పష్ట చేసింది. ఎపిక్ నంబర్ వివరాలు ఇవ్వాలని పట్టభద్రులపై ఎన్నికల అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎపిక్ నంబర్ వివరాలు అందించలేదనే ఏకైక కారణంతో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కోసం సమర్పించిన ఫారం-18 దరఖాస్తులను తిరస్కరించకూడదని తెలిపింది. సంబంధిత జిల్లా ఎన్నికల అధికారులు (DEOs), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (EROs) ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు జాబితాను సెప్టెంబర్‌లో ఈసీ విడుదల చేసింది. పట్టభద్రుల ఓట్ల నమోదు కోసం గతనెల 20న ఎన్నికల కమిషన్ పబ్లిక్ నోటీసు విడుదల చేసింది. ఇక, నవంబరు 6 వరకు ఓటరు దరఖాస్తులు స్వీకరించనుంది. నవంబరు 25న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనుంది. నవంబరు 25 నుంచి డిసెంబరు 10 వరకు అభ్యంతరాలు స్వీకరించనుంది. డిసెంబరు 30న పట్టభద్రుల తుది ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేయనుంది.
Also Read
- Conductor Pravallika: ప్రయాణికురాలితో గొడవ.. బస్సు కింద పడి చికిత్స పొందుతూ 24 ఏళ్ల కండక్టర్ మృతి..
- Cyclone Murasu: ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
- US Midterms elections: యూఎస్ ఎన్నికల్లో ట్రంప్‌కు భారీ షాక్.. ఎర్లీ ట్రెండ్స్‌లో డెమోక్రాట్ల ఆధిక్యం..
- AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
Conductor Pravallika: ప్రయాణికురాలితో గొడవ.. బస్సు కింద పడి చికిత్స పొందుతూ 24 ఏళ్ల కండక్టర్ మృతి..
-
Anil Ambani Group: అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ భారీ చర్యలు.. రూ.510 కోట్ల ఆస్తులు అటాచ్, చార్టర్డ్ విమానాలు స్వాధీనం
-
Cyclone Murasu: ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
-
US Midterms elections: యూఎస్ ఎన్నికల్లో ట్రంప్‌కు భారీ షాక్.. ఎర్లీ ట్రెండ్స్‌లో డెమోక్రాట్ల ఆధిక్యం..
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!