Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: గత వారం రోజులుగా ఇండియా కూటమి ఢిల్లీలో నిరసనల పేరుతో చేస్తున్న డ్రామాలను ప్రజలు అసహ్యహించు కుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హక్కులను దుర్వినియోగం చేస్తున్నారని, దేశప్రతిష్టను మంట గలుపుతున్నారని మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను గద్దె దిగాలని కాంగ్రెస్ మాట్లాడుతుంది.. పార్లమెంట్ స్పీకర్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేసి నవ్వుల పాలయ్యారన్నారు. ఇప్పుడు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారని, రాహుల్ బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూలదోయడమే టార్గెట్ మాట్లాడుతున్నారని, నైతిక విలువలను పక్కన పెట్టీ.. రాజ్యంగా సంస్థలను నిర్వీర్యం చేసేలా స్వార్థంగా పని చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఓడిపోతే ఎలక్షన్ కమిషన్, సుప్రీం కోర్టులు బాధ్యత వహించాలా? కాంగ్రెస్ వరుస ఓటమిలకు ఈసీ ఎలా బాధ్యత తీసుకుంటుందని నిలదీశారు. చీఫ్ జస్టిస్‌పై ఒత్తిడి తెస్తున్నారని, సుప్రీంకోర్టు పైకి వేలాది మందితో ర్యాలీగా వెళ్ళడం ఎపుడూ చూడలేదన్నారు. ప్రధాని, హోంమంత్రిని బెదిరిస్తున్నారని, భారత్ ఏమైనా సోనియా కుటుంబం ప్రయివేట్ ప్రాపర్టీనా? అని ప్రశ్నించారు. భారత దేశంలో కాంగ్రెస్ మార్క్ నియంతృత్వం నడవదని, చట్టం ప్రకారం దేశం ముందుకు పోతోందన్నారు. అమెరికా నుంచి వచ్చిన కిరాయి మనుషులు అనుకున్నట్లు దేశం నడవదన్నారు.
ప్రభుత్వ అధికారులు టచ్‌లో ఉన్నారని రాహుల్ గాంధీ అబద్ధాలు ఆడి బెదిరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. “సర్‌లో తప్పులు జరిగితే.. అందుకు ఆధారాలు చూపెట్టాలి.. సరిదిద్దే బాధ్యత అందరిదీ. పోలింగ్ బూత్‌ల వారీగా కాంగ్రెస్ ఏజెంట్లు ఉంటారు. ఓట్లు పోతే అక్కడే సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఎవరి ఓట్లు తిరస్కరించారు.. వారి ఆధారాలు బయటపెట్టాలి. SIR ద్వారా 2 కోట్ల 80 లక్షల మంది చనిపోయారని తేలింది. వాళ్ళ ఓట్లు తొలగించాల్సిన బాధ్యత లేదా? 6 కోట్ల మంది ఓటర్లు ప్రస్తుతం ఇండ్లు మారారు. ఉంటున్న చోట ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు.. ఆ అవకాశం ఉంది. కోటి మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. రెండు చోట్ల ఓట్లు కొనసాగించాలా? రాహుల్ సమాధానం చెప్పాలి. ఢిల్లీలో ఊరేగింపులు చేస్తే ఓటు హక్కు రాదు. తెలంగాణలో కలెక్టర్లు, స్కూల్ టీచర్లు, అంగన్వాడీ ఓటర్లు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే కదా? వాళ్ళతో పీఎం, జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతారా? ఇండియా కూటమి ధర్నాల్లో ఓట్లు పోయిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? రాహుల్ చూపెట్టాలి. ప్రజల మద్దతు కూడా గట్టుకోలేక… రాజ్యంగా వ్యవస్థలపై బురద జల్లుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధం లేని ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడి పోయింది. మరి ఎందుకు ఓడి పోతున్నారు. కాంగ్రెస్ కనుమరుగవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతోంది. 2014లో గెలిచినప్పుడు.. SIR , జ్ఞానేశ్ కుమార్ లేరు. అపుడు కాంగ్రెస్ ఎలా ఓడిపోయింది. తమిళ నాడులో SIR తర్వాత బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. దేశ భవిష్యత్ కు కాంగ్రెస్ వ్యవహారం కీడు చేస్తోంది. ఒంటెద్దు పోకడలతో వ్యవస్థను చిన్నా భిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు ఎక్కడ, ఏ రూపంలో జరిగినా కాంగ్రెస్ ఓడిపోతోంది. మన్మోహన్ సింగ్‌ను కీలు బొమ్మ చేసి పరిపాలన చేశారు. పీవీని అవమానించారు. అంబేడ్కర్‌ను ఓడగొట్టి అవమానించారు. ఎన్టీఆర్‌ను ఏ రకంగా గద్దె దింపారో ప్రజలు మర్చి పోరు. కాంగ్రెస్ హయంలోనే ఈవీఎంలను ప్రవేశ పెట్టారు. ఢిల్లీ ప్రజలను అస్తవ్యస్తం చేసేలా.. ఇండియా కూటమి, సీజేపీలు వ్యవహరిస్తున్నాయి. కుట్ర పూరిత నిరసనలతో ఢిల్లీ ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారు.” అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
తాజావార్తలు
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!