Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీలో జోష్ పెంచుతూ ముందుకు సాగుతున్నారు భట్టి విక్రమార్క పాదయాత్ర నేటితో సెంచరీ చేసింది. నేడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగనుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం ఉప్పల్ పాడు గ్రామంలో పాదయాత్ర శిబిరం వద్ద మధ్యాహ్నం 12 గంటలకు కేక్ కటింగ్ చేసి సంబరాలు నిర్వహించారు. నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి నుంచి ఉదయం 7:30 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుండగా.. కేతేపల్లి, చీకటి గూడెం, ఉప్పల్ పహాడ్, భాగ్యనగరం, కొప్పోలు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది. ఉప్పల్ పహాడ్ గ్రామంలో లంచ్ బ్రేక్ ఏర్పాటు చేయనున్నారు.. రాత్రికి కొప్పోలు గ్రామంలో బస చేయనున్నారు భట్టి విక్రమార్క.
తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. మండుటెండలో పాదయాత్ర చేస్తుండగా తీవ్ర జ్వరం రావడంతో.. సూర్యాపేటకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేతేపల్లి పాదయాత్ర శిబిరంలో రెండో రోజు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వడదెబ్బతో జ్వరం, నీరసం తగ్గలేదని సమాచారం. డీహైడ్రేషన్ కారణంగానే భట్టి విక్రమార్క అస్వస్థతకు గురయ్యారని సెలైన్స్ ఇక్కించారు. మరోవైపు శిబిరం వద్దకు అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్కను కాంగ్రెస్ సీనియర్ నాయకులు పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనారోగ్య సమస్యకారణంగా తాత్కాలికంగా పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన భట్టి విక్రమార్క. నేటి నుంచి తిరిగి పీపుల్స్ మార్చ్‌ని ప్రారంభించనున్నారు.. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ పాదయాత్ర చేయవచ్చని డాక్టర్లు సూచించడంతో.. డాక్టర్ల సూచన మేరకు నేటి టినుండి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు..
Read also: BCCI Chief Selector: శాలరీ తక్కువని.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవిని వద్దనుకున్న భారత దిగ్గజం!
2023 మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం బజరహాత్నూర్ మండలం పిప్పిరి గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించారు భట్టి. పాదయాత్ర సమయంలో భట్టి కొన్నిసార్లు అస్వస్థతకు గురికావడం, కొన్ని ప్రతీకూల పరిస్థితులు ఎదురైనా రెండు మూడు మార్లు పాదయాత్రకు బ్రేక్ పడింది. ఆ తరువాత పాదయాత్రను కొనసాగిస్తూ ప్రజల్లో మమేకమై అందరి బాధలను వింటూ ముందుకు సాగిన భట్టి పాదయాత్ర 100వ రోజుకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీలో జోష్ పెంచుతూ ముందుకు సాగుతున్నారు భట్టి విక్రమార్క.. తమ మధ్య ఉన్న విభేదాలు పక్కనబెట్టి అంతా కలిసి వస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.. ప్రతి ఇంటి గడప తాకుతూ.. ప్రతీ గుండెను పలకరిస్తూ.. మహిళలు, యువకులు, రైతులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, గొల్ల కురుమలు, చిరు వ్యాపారస్తులు, చేనేత కార్మికులు, వృద్ధులు.. అందరినీ కదిలిస్తూ.. వారి కష్టాలు తెలుసుకుంటూ.. వారి ఆశీర్వాదం పొందుతూ.. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తూ పట్టు వదలని విక్రమార్కుడిలా..
పుల్స్ మార్చ్ పేరుతో ముందుకు సాగుతున్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. గ్రామాలలో పండుగలా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కదులుతోంది.. పాలకులకు పాఠం నేర్పాలనే లక్ష్యంతోనే ప్రభంజనంతో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సాగుతుంది అంటున్నారు విక్రమార్క.. నడకలో ఉత్సాహం నింపుతూ.. జనంతో మమేకమవుతూ.. సమస్యలు వింటూ.. పరిష్కార మార్గాలు చూపుతూ.. వచ్చేది మా ప్రభుత్వమే ఇక, మీ కష్టాలు అన్నీ తీరుస్తాం అని అభయం ఇస్తూ వడివడిగా అడుగులు వేస్తున్నారు. గాలి దుమారాలు.. విపరీత ఎండలు.. ఊహించని భారీ వర్షాలు.. అయినా కూడా తనతో నడిచే కార్యకర్తలతో సమానంగా టెంట్ లో ఉంటూ.. వారితో కలిసి తింటూ.. కలియ తిరుగుతున్న భట్టి విక్రమార్క.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో పాదయాత్ర ముగియగా.. సూర్యాపేట మీదుగా ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టనున్నారు భట్టి విక్రమార్క.