Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీలో జోష్ పెంచుతూ ముందుకు సాగుతున్నారు భట్టి విక్రమార్క పాదయాత్ర నేటితో సెంచరీ చేసింది. నేడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగనుంది.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వందో రోజుకు చేరువైంది.. విక్రమార్క పాదయాత్ర 100వ రోజు శుక్రవారం నాడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగనుంది. నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి నుంచి ఉదయం 7:30 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుండగా.. కేతేపల్లి, చీకటి గూడెం, ఉప్పల్ పహాడ్, భాగ్యనగరం, కొప్పోలు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది.
Jana Reddy: యాదాద్రి జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్రలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనకపోవడం పై నేను స్పందించను అని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విభేదాలను పక్కనపెట్టి ప్రతి ఒక్కరు ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
తెలంగాణ వెలిగిపోతుందని, 24 గంటల ఉచిత కరెంటు మా ప్రభుత్వం వల్లనే వస్తుందని గొప్పలు చెబుతున్న కేసీఆర్ తొమ్మిదేళ్లుగా ఒక్క పవర్ ప్రాజెక్ట్ అయినా ఎందుకు కట్టలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన పవర్ ప్రాజెక్టుల వల్లే ఇప్పుడు 24 గంటల ఉచిత విద్యుత్తును బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తోందని ఆయన అన్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూరగుపల్లిలో ఆయన యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్ర 6 వ రోజున చేరుకుంది. ఇవాళ భట్టి పాదయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొననున్నారు. నేడు కొమురం భీం జిల్లా జామ్నే నుంచి కెరమెరి ఘాట్ రోడ్ మీదుగా కెరమెరి మండల కేంద్రము వరకు పీపుల్స్ మార్చ్ సాగనుంది.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర మళ్లీ మొదలుకాబోతోంది. చిన్ని బ్రేక్ తర్వాత… మళ్లీ పాదయాత్రకు సిద్ధమయ్యారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పీపుల్స్ మార్చ్ పేరుతో మొదలైన ఆయన పాదయాత్ర… తిరిగి కొనసాగనుంది. ఫిబ్రవరి 27న ముదిగొండ మండలం యడవల్లి నుంచి ప్రారంభమైన భట్టి పాదయాత్ర… ఈ నెల 5న గంధసిరి గ్రామం వరకు కొనసాగింది. సుమారు 102 కిలోమీటర్ల మేర నడిచారు భట్టి. అసెంబ్లీ సమావేశాల కారణంగా యాత్రకు బ్రేక్ వేశారు. సభ…
తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారానికి పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర)ను ఇవాళ ప్రారంభించారు.. ముదిగొండ మండలం యడవల్లిలో యాత్ర ప్రారంభమైంది.. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఖమ్మం జిల్లా నాయకులు ఈ సందర్భంగా భట్టి విక్రమార్కకి ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్ర ప్రారంభించిన యడవెల్లి జన ఉప్పెనగా మారింది. గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీర…