Bhatti Vikramarkaa: నీకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarkaa: నీకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టా అంటూ మండిపడ్డారు కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. లిక్కర్ స్కామ్.. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాల అతలాకుతలం చేస్తోందన్నారు. గాంధీ టోపీలు పెట్టుకుని కేజ్రివాల్.. ఆర్టీఐ లో దరఖాస్తు పెట్టి దేశాన్ని తప్పుతోవ పట్టించారన్నారు. అవినీతిని చీపురు తో ఊడ్చేస్తాం అని చెప్పిన అలాంటి కేజ్రీవాల్…లిక్కర్ స్కామ్ లో పాల్గొనడం దుర్మార్గం అన్నారు. దేశంలో ఏ పార్టీ చేయనంత లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్ సర్కార్ చేసిందని ఆరోపించారు. అన్నా హజారే ఎక్కడ ఉన్నారు ? హజారే సేవ.. కేజ్రీవాల్ కి ధార పోసినట్టు అయ్యిందని ప్రశ్నించారు. ఢిల్లీ లో ఇలాంటి స్కామ్ జరిగింది …హజారే బయటకు వచ్చి మాట్లాడాలి అంటూ డిమాండ్ చేశారు. పాలసీ క్యాబినెట్ ఉమ్మడి నిర్ణయం.. మంత్రి ఒక్కడిదే బాధ్యత కాదని గుర్తు చేశారు. సిసోడియానే కాదు.. కేజ్రీవాల్ కూడా బాద్యుడే అంటూ ఆరోపించారు. దేశానికి సమాధానం చెప్పాలని కోరారు. కవిత మీద అభియోగాలు వచ్చాయి.. సమగ్ర విచారణ కి సిద్ధం అని చెప్పాలి కానీ తెలంగాణా కు అవమానం అనడం ఏంటి ? అని ప్రశ్నించారు.
Read also: Minister KTR: కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదు మోడీ సమన్లు
Also Read
తెలంగాణకి లిక్కర్ అవినీతికి సంబంధం ఏంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నీకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టా? తెలంగాణ ప్రజలు గమనించాలని అన్నారు. అవినీతి లో ఎంత పెద్దవాళ్ళు అయినా.. దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరిని వదిలి పెట్టొద్దని సూచించారు. కవితకి నోటీసులు తెలంగాణ కి అవమానం అని అంటే… సమాజం ప్రశ్నించాలని కోరారు. ప్రతి పక్షాలను వేధిస్తోంది కేంద్రం అనేది వేరే చర్చ.. అందులో నిస్సందేహం అన్నారు. కానీ లిక్కర్ స్కామ్ కి… వేదించడానికి సంబంధం లేదు అంటూ తెలిపారు భట్టి. లేని విషయాల్లో వెంటాడితే… ఖండించాలన్నారు. సోనియా.. రాహుల్ గాంధీలకు నోటీసులు ఇచ్చారని, వాళ్ళు మద్యం లాంటి స్కామ్ కాదని గుర్తు చేశారు. వ్యక్తిగత దోపిడీ చేశారని అభియోగాలు ఎదుర్కోలేదన్నారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ రక్షణ కోసం… పార్టీ బాధ్యతగా రుణం ఇచ్చింది అది తప్పు అని కేసు పెట్టారని భట్టి గుర్తు చేశారు. ఈడీ, సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చారని, అయినా పిలవడం వేదించడమే అన్నారు. లిక్కర్ కేసుకి .. వేధింపులకు సంబంధం లేదన్నారు. కవిత లిక్కర్ స్కామ్ చేస్తే.. జనం కి ఏం సబందం అంటూ భట్టి విక్రమార్క మండిపడ్డారు.
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!