ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సచివాలయంలో సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు టీ-ఫైబర్ ప్రాజెక్టు పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు ప్రసాద్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కేవలం టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిర్దేశిత వ్యవధిలోగా అవసరమైన మౌలిక సదుపాయాలు, నెట్వర్క్ కనెక్టివిటీ పనులను పూర్తి చేసి ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని టీ-ఫైబర్ పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1 తర్వాత ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎటువంటి బిల్లులు ప్రాసెస్ చేయవద్దని, చెల్లింపులు జరపవద్దని అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
ప్రభుత్వ శాఖలకు అంతరాయం లేని కనెక్టివిటీని అందించేందుకు టి-స్వాన్ (T-SWAN)ను ఒక నెల రోజుల్లోగా టీ-ఫైబర్ నెట్‌వర్క్‌లోకి పూర్తిగా బదిలీ చేయాలని సూచించారు. అలాగే.. ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు ప్రారంభం నుంచే ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించేలా వేగవంతమైన టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవలకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర పౌరులందరికీ డిజిటల్ కనెక్టివిటీ అందించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ‘ఇంటింటికీ ఇంటర్నెట్’ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నివాస గృహాలకు బ్రాడ్‌బ్యాండ్ విస్తరణను వేగవంతం చేయడం ద్వారా ప్రభుత్వ సంస్థలతో పాటు పౌరులందరికీ విశ్వసనీయమైన, సురక్షితమైన, సరసమైన ధరలో హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!