Mahesh Kumar Goud: కార్పొరేటర్ స్థాయి లీడర్లు కూడా బీజేపీ లేరని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో 80 కి పైగా స్థానాలతో కాంగ్రెస్ అధికారంలో రాబోతుందని అన్నారు. కర్ణాటక ఫలితాలతో బండి సంజయ్ మైండ్ బ్లాక్ అయ్యిందని ఎద్దేవ చేశారు. కనీస అవగాహన లేకుండా గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు ఒక్కటే అని ఆరోపించారు. కర్ణాటక ఫలితాలతో తెలంగాణలో బీజేపీ భూస్థాపితం అయ్యిందని తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు. కార్పొరేటర్ స్థాయి లీడర్లు కూడా బీజేపీ లేరు, తెలంగాణ ఆ పార్టీ ఎలా ప్రత్యామ్నాయం అవుతుందన్నారు.
Read also: Devara: ‘దేవర’ కోసం ‘దసరా’ విలన్…
జూన్ లో కాంగ్రెస్ లో సీనియర్ నేతల చేరికలు, ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ సీనియర్లు కాంగ్రెస్ లో వస్తారని అన్నారు. 11 మంది బీఆర్ఎస్ మంత్రులు ఓడిపోయే లిస్టులో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ లిస్టు కేసీఆర్ కు తెలుసని వ్యాగాస్త్రం వేశారు. 105 స్థానాల్లో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తా అని కేసీఆర్ కాకి లెక్కలు చెబుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎం.ఎల్.ఏ. లను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో 80కి పైగా స్థానాలతో కాంగ్రెస్ అధికారంలో రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో బీజేపీ మాదిరి తెలంగాణలో బీఆర్‌ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని తీవ్రంగా ఆరోపించారు. బీఆర్‌ఎస్ ను ఇంటికి పంపేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Justice for VOA: కలెక్టరేట్ ముందు విఓఏల ఆందోళన.. సమస్యలను పరిష్కరించాలని నిరసన