తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జిల్లా బికనూర్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. తాను బాసర అర్జీయూకేటి-ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతు తెలపడానికి, సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్నానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. బండి సంజయ్‌ను పోలీసు వాహనంలో ఎక్కించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, మహిళలు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. కాన్వాయి ముందు ఉన్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో బికనూర్ జాతీయ రహదారి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ నేతలు రోడ్డు పైన బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసుల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకె ట్రిపుల్ ఐటీకి వెళుతున్నానని పోలీసులతో చెప్పినా అరెస్ట్ చేయడం ఏంటని మండి పడ్డారు. విద్యార్థుల ఆందోళన చేస్తుంటే కరెంట్, నీళ్లు కట్ చేయడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. వాళ్లేమైన తీవ్రవాదులా అంటూ ఫైర్ అయ్యారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన సీఎం సిల్లీ సమస్యలంటూ రెచ్చగొడతారా అంటూ నిలదీసారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై గవర్నర్ తమిళిసై సీఎం విద్యార్థులతో మాట్లాడితే ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ బండి సంజయ్ చెప్పుకొచ్చారు. సమస్యలు తెలుసుకోవాలని వెళితే అడ్డుకుంటారా అంటూ పోలీసుల పైన బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ట్రిపుల్ ఐటీలో చదువుకునే వాళ్లంతా పేద విద్యార్థులే.. వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరడం తప్పా అని నిలదీసారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాడతామని స్పష్టం చేసారు. ట్రిపుల్ ఐటీ వెళ్లి తీరుతనని స్పష్టం చేసిన బండి సంజయ్ స్పష్టం చేసారు. దీంతో..పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీని పైన బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Live: Addressing the Press at Bhiknoor. https://t.co/XNaK6WUyzU
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 17, 2022