Off The Record: శత్రువులు ఎక్కడో ఉండరు.. కూతుళ్ళు, చెల్లెళ్ళ రూపంలో మారు వేషాల్లో మన కొంపల్లోనే తిరుగుతుంటారన్న పాపులర్ సినిమా డైలాగ్‌ని గుర్తు తెచ్చుకుంటున్నారట ఆ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు.
గద్వాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మార్పుతో లోకల్ కేడర్‌లో గందరగోళం పెరిగింది. దాంతో నడిగడ్డ కారుకు గట్టి రిపేర్లు చేసి గాడిన పెట్టేందుకు తీవ్ర కసరత్తు చేస్తోందట గులాబీ అధిష్టానం. నెలల తరబడి స్తబ్దుగా ఉన్న గద్వాల్ కేడర్‌లో ఊపు తెచ్చే ప్రయత్నం మొదలైనట్టు తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్....
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నరపరాజు రామచందర్ రావు, గద్వాలలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాబోయే పంచాయతీ రాజ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బిజెపిపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని, రైతుల సమస్యలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత గద్వాలకు మొదటిసారి వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. Also Read:Bandi Sanjay: ఎన్ని చర్చిలు, మసీదులు ఉన్నా,…
Gadwal Murder : జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు మలుపు తిరిగింది. ఈ కేసు మొదట కనిపించినంత సాధారణం కాకుండా, దాని వెనుక ఉన్న కథనం ఆవిష్కరించబడుతున్న కొద్దీ నోరెళ్లబెట్టే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 32 ఏళ్ల తేజేశ్వర్‌కు కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. కానీ పెళ్లికి కేవలం ఐదు రోజులు ముందు ఐశ్వర్య అనూహ్యంగా అదృశ్యమైంది. ఆమె కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకు ఉద్యోగితో…
లోక్‌సభ సభ్యుడు.... తన నియోజక వర్గంలో ఎక్కడైనా సరే.. ఎమ్మెల్యేలకు ముందస్తు సమాచారం ఇచ్చి తిరగొచ్చు. సొంత పార్టీ ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఉద్దేశ్యపూర్వకంగా గొడవ పెట్టుకోవాలనుకుంటే తప్ప.. సాధారణంగా లొల్లి ఎందుకులే అనుకుంటూ అందర్నీ కలుపుకుని పోతుంటారు ఎంపీలు. కానీ.... నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవికి ఇప్పుడో చిక్కొచ్చి పడిందట.
నడిగడ్డ ప్రాంతంగా చెప్పుకునే గద్వాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటుంది. 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించి అసెంబ్లీకి పంపిన ఇక్కడి ఓటర్లు.. 2018, 2023 ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్‌కు బాసటగా నిలిచారు. మారిన రాజకీయ పరిణామాలతో గద్వాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి... మంత్రి జూపల్లి ప్రోద్బలంతో కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు.
అక్కడ కారు ఫుల్ కండిషన్‌లో ఉందట. కానీ…. నడిపేందుకు డ్రైవర్ మాత్రం లేడు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారన్న ఎదురు చూపులతోనే సరిపోతోంది కేడర్‌కు. ప్రస్తుతానికి క్రైసిస్ టైం అయినా… భవిష్యత్ బాగుంటుందని కార్యకర్తలు నమ్మకంతో ఉంటే… వాళ్ళని నడపాల్సిన నాయకులు మాత్రం అడ్రస్‌లేరు. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎందుకలా జరుగుతుతోంది? నడిగడ్డ ప్రాంతంగా చెప్పుకునే గద్వాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటుంది. 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపగా…
తిరుమలలో కిడ్నాప్ కు గురైన మూడేళ్ల చిన్నారి ఘటన సుఖాంతమైంది. ఈరోజు మధ్యాహ్నం ఓ మహిళ చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో వెల్లడైంది. తెలంగాణలోని గద్వాల్ జిల్లాకు చెందిన అభినయ్ అనే మూడేళ్ల చిన్నారిని ఓ మహిళ అపహరించింది. యాత్రికుల వసతి సముదాయం 2 వద్ద చిన్నారిని ఎత్తుకెళ్లింది. దీంతో హుటాహుటిన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా బాలుడి ఆచూకీ కోసం గాలించారు. సాయంత్రం 5 గంటల…
పాలకుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. గద్వాలలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు. ఈ ప్రాంతాన్ని కేసీఆర్ సంపూర్ణంగా నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు.
గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది.