Bandi Sanjay: కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ పౌరసరఫరాల శాఖలోనే ఉందని నల్లగొండ బీజేపీ కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ఆమలులో పూర్తిగా విఫలమైందన్నారు. కాలేశ్వరం తరువాత అత్యంత అవినీతి, స్కాం లకు కేర్ ఆఫ్ గా పౌర సరఫరా శాఖ మారిందన్నారు. పౌరసరఫరాల శాఖ అప్పుల కుప్పగా మారిందని ఆరోపించారు. పౌర సరఫరాల శాఖలో అవినీతి, అప్పులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు. గతంలో బీఆర్ఎస్, తాజాగా కాంగ్రెస్.. పౌర సరఫరాల శాఖ అక్రమాలకు, అవినీతికి వత్తాసు పలుకుతుందన్నారు. పౌర సరఫరాల శాఖ పై సమగ్ర విచారణ జరపాలన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఆ శాఖపై నిస్మాక్షిక విచారణ చేస్తే.. ప్రజలు పాలాభిషేకం చేస్తారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని గెలిపించాలన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలకు పెద్ద తలకాయ వచ్చిందని, అందుకే హిందూ దేవుళ్లను, రాముడిని, వారి ప్రసాదాలను అవమానిస్తున్నారని మండిపడ్డారు.
Read also: Hyderabad: హల్వా తిన్న మహిళ.. మరుసటి రోజు
హిందూ దేవుళ్లను అవమానిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఉప ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. శనివారం నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మతపరమైన రిజర్వేషన్లను సహించేది లేదని స్పష్టం చేశారు. అన్ని వర్గాల వారిని సమానంగా ఆదరిస్తే స్వాగతిస్తామని, అయితే ఒక వర్గానికి కొమ్ము కాస్తే మాత్రం సహించేది లేదన్నారు. మైనారిటీ ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీకి 80 శాతం హిందువులందరూ గుణపాఠం చెప్పాలన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలని కోరితే, అసెంబ్లీలో పోరాడేందుకు బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అదేవిధంగా శాసనమండలిలో పోరాడేందుకు ప్రేమేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. హిందువులందరూ దీని గురించి ఆలోచించాలి. బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మాకు లేదని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ ఎవరికీ అవకాశం ఇవ్వదని ఆయన సెటైర్లు వేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ కాంగ్రెస్ నాయకుడిని ప్రజలు రోడ్లపైకి తిప్పే పరిస్థితి లేదన్నారు. ఆరు హామీల సంగతి ఏమిటని ప్రజలు నిలదీస్తారని అన్నారు.
Canada: కెనడాలో బస్సును ఢీకొట్టిన భారతీయ సంతతి ట్రక్ డ్రైవర్.. 16 మంది మృతి