Hyderabad: హల్వా తిన్న మహిళ.. మరుసటి రోజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: నగరంలో ఆహార పదార్థాల కల్తీ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, కాలం చెల్లిన మాంసాన్ని వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అయితే తాజాగా.. లక్డీకపూల్‌లోని ద్వారకా హోటల్‌లో హల్వా తిని ఓ మహిళ అస్వస్థతకు గురైంది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read also: Telangana: తెలంగాణలో మళ్లీ మండుతున్న ఎండలు..
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ఈనెల 23న స్రవంతి తన కుటుంబ సభ్యులతో కలిసి మల్కాజిగిరి ప్రాంతంలోని ద్వారకా హోటల్‌కు వచ్చింది. హోటల్‌లో క్యారెట్ హల్వా తిన్న ఆమెకు డీహైడ్రేషన్, కడుపునొప్పి వచ్చింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లింది. అనంతరం ఫుడ్ పాయిజన్ అయిందని బాధితురాలు ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించి ఫుడ్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపినట్లు ఖైరతాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపారు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వారు నిర్వహించిన తనిఖీలకు సంబంధించిన వివరాలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈనెల 23న రామేశ్వరం కేపులో నిర్వహించిన తనిఖీల్లో మార్చి నెలలో గడువు ముగిసిన 100 కిలోల మినపప్పు దొరికినట్లు తెలిపారు. దీని విలువ 16 వేలు ఉంటుందని చెప్పారు. అలాగే కాలం చెల్లిన పది కిలోల నందిని పెరుగు, 8 లీటర్ల పాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బంజారా హిల్స్ , సికింద్రాబాద్ లో నిర్వహించిన తనిఖీల్లో కాలపరిమితి ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించామని తెలిపారు. ప్రజలు బయట ఫుడ్ తినే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Task force team has conducted inspections in the Madhapur area on 23.05.2024.
The Rameshwaram Cafe
* Urad Dal (100Kg) stock found expired in Mar'24 worth Rs. 16K
* Nandini Curd (10kg), Milk (8L) worth Rs. 700 found expired
Above items discarded on the spot.
(1/4) pic.twitter.com/mVblmOuqZk
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) May 23, 2024
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!