కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన జసికిరత్ సింగ్ సిధ్దూని భారత్ కు పంపించి వేయాలని ఆ దేశం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. అతడు ఆరు సంవత్సరాల క్రితం కెనడాలో ఘోరమైన రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు.. సిధ్దూ సాధారణ ట్రక్కు డ్రైవర్ గా అక్కడ పని చేస్తున్నాడు.. ఇక, 2014లో సిధ్దూ కెనడాకు వలస వెళ్లాడు.. సస్కట్చేవాన్ ప్రావిన్స్‌లోని టిస్‌డేల్ సమీపంలోని ఓ జంక్షన్ దగ్గర హంబోల్ట్ బ్రోంకోస్ జూనియర్ హాకీ జట్టు బస్సు మార్గంలోకి వెళ్లింది.. అదే సమయంలో సిధ్దూ నడుపుతున్న ట్రక్కు హాకీ జట్టు బస్సును ఢీ కొట్టడంతో 16 మంది అక్కడికక్కడే మృత్యు వాత పడ్డారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Read Also: Lokshabha Elections 2024: నేడు లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్.. లైవ్ అప్ డేట్స్
ఇక, ఈ ఘటనపై విచారించిన తర్వాత ట్రక్ డ్రైవర్ సిద్ధూని భారత్ కు తిరిగి పంపేయాలని ఫెడరల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. దీనికి ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీ బోర్డు శుక్రవారం ఆమోద ముద్ర కూడా వేసింది. అయితే, 2018లో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రమాదకరమైన డ్రైవింగ్‌కు అతడు ఎనిమిదేళ్ల శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత అతనికి బెయిల్ వచ్చింది. ఇదిలా వుంటే శాశ్వత నివాస హోదా కోసం సిద్ధూ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకునే ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇది సంవత్సరాలు పట్టవచ్చని ఆయన తరపు న్యాయవాది గ్రీన్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు సిద్ధూను భారత్ కు పంపాలని కోరడంతో ఫెడరల్ కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని సిద్ధూ తరపు లాయర్ వెల్లడించారు.