బేగంపేట్ పోలీస్ స్టేషన్ లో అంబుడ్స్ మెన్ పై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఫిర్యాదు చేశారు. హెచ్ సీఏ ప్రస్తుత కార్యవర్గాన్ని జింఖానా ఆఫీస్ లో అంబ్బుడ్స్ మెన్ వారు భయపెడుతున్నారు అంటూ ఫిర్యాదులో హెచ్ సీఏ అధ్యకుడు అజారుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అజారుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కు గతంలో సస్పెండ్ చేసిన అంబడ్స్ మెన్ కు మధ్య గత కొద్దీ రోజులుగా వివాదం నడుస్తోంది. అయితే ఈ వివాదంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఇంతలోనే అజారుద్దీన్ అంబుడ్స్ మెన్ పై బేగంపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మరోసారి తెరపైకి హెచ్ సీఏ వివాదం ఘటన వచ్చింది.