Ande Sri Journey: డాక్టర్ అందెశ్రీ, తెలంగాణ రాష్ట్రంలో పుట్టి, తన అద్భుతమైన సాహిత్యం ద్వారా ప్రజా కవిగా పేరొందారు. జనగాం వద్ద గల మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో అందె ఎల్లయ్య అనే అసలు పేరుతో జన్మించిన ఆయన జీవిత ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. అందెశ్రీ అనాథగా పెరిగారు, కనీసం చదువుకునే అవకాశం కూడా దక్కలేదు.. ఆయన జీవితం గోడ్ల కాపరిగా ప్రారంభమైంది.. ఒక రోజు ఆయన పాడుతుండగా విన్న శృంగేరి మఠానికి చెందిన స్వామీ శంకర్ మహారాజ్ చేరదీయడంతో అతడి జీవితంలో కీలక మలుపు తిరిగింది. చదువుకోకపోయినా, ఆయన కవిత్వ ప్రతిభను గుర్తించిన కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటును అందించింది. ఇక, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవిగా అందెశ్రీ కీలక పాత్రను పోషించారు. ఆయన కేవలం పాటలకే పరిమితం కాకుండా, తెలంగాణ ధూం ధాం కార్యక్రమ రూపశిల్పిగా 10 జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. ప్రజాకవి అందెశ్రీ తన పాటల ద్వారా తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. అలాగే, అందెశ్రీ 2006లో గంగ సినిమా కోసం రచించినందుకు నంది పురస్కారం అందుకున్నారు.
Read Also: Karthika Masam 2025: కార్తీక సోమవారం ఎఫెక్ట్.. గోదావరి నదిలో కిటకిటలాడుతున్న స్నాన ఘట్టాలు..
అందెశ్రీ పాటలు, పురస్కారాలు
ప్రముఖ, రచయిత అందెశ్రీ పాటలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదరణ సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆర్. నారాయణ మూర్తి డైరెక్షన్ లో వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఆయన పాటల పాత్ర ఎంతో ఉంది. తెలంగాణ, ప్రకృతి, మానవ సంబంధాల లాంటి అంశాలపై ఆయన రాసిన గేయాలు ప్రజల హృదయాలను చేరుకున్నాయి.
అందేశ్రీ ప్రసిద్ధ గేయాలు:
జయజయహే తెలంగాణ జననీ జయకేతనం (తెలంగాణ రాష్ట్ర గీతం)
పల్లెనీకు వందనములమ్మో
మాయమై పోతున్నడమ్మో మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు
గలగల గజ్జెలబండి
కొమ్మ చెక్కితే బొమ్మరా…
జన జాతరలో మన గీతం
యెల్లిపోతున్నావా తల్లి
చూడ చక్కని
ఆవారాగాడు (సినిమా)
Read Also: Ande Sri: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
అందెశ్రీ పురస్కారాలు:
కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్..
అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్ టౌన్ డీసీ వారిచే గౌరవ డాక్టరేట్, లోక కవి బిరుదు (2014 ఫిబ్రవరి 1)..
వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చేత దాశరథి సాహితీ పురస్కారం (2015 ఆగస్టు 14)..
డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం (2015 జూలై 5)..