Ande Sri: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. ఇవాళ (నవంబర్ 10న) తెల్లవారుజామున తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు ఆయనను పరీక్షించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
Read Also: Trending Topic : సోషల్ మీడియాని ఊపేస్తున్న గిరిజా.. ఇంతకీ ఎవరామె?
ఇక, జనగాం దగ్గర రేబర్తి అనే గ్రామంలో రచయిత అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య.. అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రచించారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోవత్సం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని అందెశ్రీ అందుకున్నారు.