Ambulance Overturned: అత్యవసర సమయాల్లో ఫోన్ చేసిన వెంటనే కుయ్.. కుయ్ అంటూ నిమిషాల్లో ట్రాఫిక్ ఉన్నా.. ఎన్ని అవాంతరాలు చోటుచేసుకున్నా.. వారి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రాణాలను కాపాడేందుకు ముందుంటారు అంబులెన్స్ డ్రైవర్లు. రోగికి ప్రాణాలు కాపాడటానికి వారి ప్రాణాలు సైతం పణంగా పెడుతుంటారు. అయితే ఓ అంబులెన్స్ డ్రైవర్ ఓ రోగికి సీరియస్ గా ఉండటంతో వారికి ఆసుపత్రి వద్ద డ్రాప్ చేశాడు. అయితే డ్రైవర్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో డివైడర్‌ను ఢీ కొట్టడంతో దీంతో డ్రైవర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అది చూసిన వారందరూ చలించిపోయారు. ఈ ఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది.
Read also: KTR Birthday Special: ఒకప్పుడు చికెన్, లిక్కర్ బాటిళ్లు పంచితే.. ఇప్పుడు టమాటాలు పంచుతున్నారు
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో హస్తినాపురం వద్ద ఓ ప్రైవేట్ అంబులెన్స్ ప్రమాదానికి గురైంది.. మంటల్లో అంబులెన్స్ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అంబులెన్స్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మలక్‌పేటకు చెందిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ బీఎన్‌రెడ్డి హస్తినాపురం వద్ద డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే డ్రైవర్‌ను బయటకు తీశారు. అయితే, తీవ్రంగా గాయపడిన అంబులెన్స్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో అంబులెన్స్‌ను తొలగించే ప్రయత్నం చేయగా అందులోని ఆక్సిజన్ సిలిండర్ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి. అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఆక్సిజన్ సిలిండర్ పేలుడు ధాటికి అక్కడే వున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంటి నుంచి బయటకు పరుగులు పెట్టారు. బయటకు వచ్చి చూడగా అంబులెన్స్ దగ్ధం కావడంతో చూసి షాక్ కు గురయ్యారు. స్థానిక సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన డ్రైవర్ కుటుంబ సభ్యులను సమాచారం అందించారు. ఇబ్రహీంపట్నం మలక్ పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి రోగులను దింపుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Lizard in Mouth: నోట్లో బల్లిపడి బాలుడు మృతి.. అసాధ్యం అంటోన్న జంతు నిపుణులు!