రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసులో రోజుకో ట్విస్ట్ వస్తూనే ఉంది. సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మైనర్‌పై సామూహిక లైంగిక దాడి ఘటనలో ఇప్పటికే బాధితురాలి మెడికల్ రిపోర్టును వైద్యులు,పోలీసులకు అందించారు. కాగా, పోలీసులు ఇప్పటికే మైనర్‌కు రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇక ఈ మెడికల్ రిపోర్ట్ ప్రకారం లైంగిక దాడి జరిగే సమయంలో మైనర్ మెడపై నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్టు వెల్లడైంది. ఆ సమయంలో మైనర్ లైంగిక దాడికి నిరాకరించడంతో నిందితులు ఆమెపై గోళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో మైనర్ శరీరంపై 12 గాయాలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో నిందితులుగా వున్నా మైనర్లను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. అయితే ఇప్పటికే ముగ్గురు మైనర్లకు పోటెన్షియల్ టెస్ట్ నిర్వహించారు వైద్యులు. అయితే మరో ఇద్దరు మైనర్లను మరికొద్దిసేపట్లో ఉస్మానియాకు ఆసుపత్రికి తీసుకురానున్నరు పోలీసులు. ఇక ఈ వైద్య పరీక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ కేసులో నిందితులుగా వున్న మరో ఇద్దరు మైనర్లను జువైనల్ హోం కు తీసుకురానున్నారు పోలీసులు. అయితే ఇప్పటికే ముగ్గురు మైనర్లకు వైద్య పరీక్షలు నిర్వహించగా, ఏ-1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కు పోటెన్సిల్ టెస్ట్ ముగించుకుని జూబ్లీహిల్స్ పీఎస్ కు తరలించారు పోలీసులు. అయితే వైద్య పరీక్షల అనంతరం ఈ ఐదుగురు మైనర్ నిందితులను జువైనల్ హోం కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ రోజు మొత్తం కేవలం వైద్య పరీక్షలకే సమయం సరిపోవడంతో రేపు ఈ నిందితులను కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. అనంతరం రేపు జువైనల్ హోం నుండి ఐదుగురిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో సాదుద్దీన్ కు రేపటితో కస్టడీ ముగియనుండటంతో ఆరుగురిని కలిపి రేపు విచారించనున్నారు దర్యాప్తు అధికారులు. ఈ విచారణలో మరిన్ని కీలక అంశాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు పోలీసులు.