jubilee hills police petition to consider minors as majors in amnesia pub case: హైదరాబాద్‌లోని అమ్నీషియా పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలికపై సామూహిక అత్యాచార నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టులో కాకుండా సాధారణ న్యాయస్థానంలో విచారణ జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి సమగ్ర ఆధారాలతో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఒకట్రెండు రోజుల్లో న్యాయస్థానంలో మెమో దాఖలు చేయనున్నట్లు…
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసులో రోజుకో ట్విస్ట్ వస్తూనే ఉంది. సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మైనర్‌పై సామూహిక లైంగిక దాడి ఘటనలో ఇప్పటికే బాధితురాలి మెడికల్ రిపోర్టును వైద్యులు,పోలీసులకు అందించారు. కాగా, పోలీసులు ఇప్పటికే మైనర్‌కు రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ మెడికల్ రిపోర్ట్ ప్రకారం లైంగిక దాడి జరిగే సమయంలో మైనర్ మెడపై నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్టు వెల్లడైంది. ఆ సమయంలో మైనర్ లైంగిక…
జూబ్లీహిల్స్ అమ్మాయి అత్యాచారం కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. నిందితులను విచారిస్తున్నారు. గురువారం కేసులో కీలకంగా ఉన్న మేజర్ అయిన సాదుద్దీన్ మాలిక్ ను పోలీసులు విచారించారు. దాదాపుగా 5 గంటలు పాటు విచారణ కొనసాగింది. ఫోన్ సీడీఆర్ డేటా, సీసీ కెమెరా ఫులేజ్ ను ముందుపెట్టి పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాదుద్దీన్ మాలిక్ కు మైనర్లతో ఉన్న పరిచయాలు, సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులే కాకుండా ఇతర వ్యక్తుల…
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మొన్నటి వరకు అత్యాచార ఘటనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడితే.. ఎమ్మెల్యే రఘునందర్ రావు మరిన్ని ఆధారాలు బయటపెట్టడం, బాధిత అమ్మాయి విజువల్స్, ఫోటోలను బయటపెడ్డటంతో ఇంకో టర్న్ తీసుకుంది ఈ కేసు. అత్యాచార బాధితురాలి ఫోటోలు, విజువల్స్ ఎలా బయటపెడుతారంటూ.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ పార్టీతో పాటు రఘునందన్ రావుపై ఫైర్ అవుతున్నాయి. తాజాగా ఈ వివాదంలో రఘునందన్…
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన కేసులో ఊహించని పరిణామాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దర్యాప్తును వేగవంతం చేసి, నిందితుల్ని అరెస్ట్ చేస్తోన్న పోలీసులు.. సాక్ష్యాలను సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఈ కేసులో కీలకంగా మారిన ఇన్నోవా, బెంజ్ కార్లని స్వాధీనం చేసుకున్నారు. అయితే, తాజాగా అందరూ విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్నోవా కారుని పరిశీలించిన పోలీసులకు.. ఆ కారుని నిందితులు సర్వీసింగ్ చేయించినట్టు తెలిసింది. అందులో ఉన్న సాక్ష్యాలేవీ దొరక్కుండా ఉండేందుకు నిందితులు తెలివిగా…
జూబ్లీ హిల్స్ అత్యాచార ఘటనలో అరెస్ట్ అయిన నిందితులపై నార్కోటిక్ టెస్ట్ చేయించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో వారిపై విచారణ జరిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ రేప్ కేసు నిందితులు ఈ ఒక్క ఘటన మాత్రమే కాకుండా మరెన్నో దారుణాలకి పాల్పడి ఉంటారని తాను అనుకుంటున్నానని అనుమానం వ్యక్తం చేశారు. ‘‘మా నాన్న టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల్లో ఉంటే మేమంతా సేఫ్’’ అనే భావనకు నేతల పిల్లలు వచ్చారని…
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. తాజాగా మరో విషయం బట్టబయలైంది. ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత నిందితులు ఇన్నోవా కారులో మొయినాబాద్‌కు వెళ్లినట్టు తేలింది. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫామ్‌హౌస్‌లో ఆశ్రయం పొందినట్టు తెలిసింది. ఆ ఫామ్‌హౌస్ వెనకాలే ఇన్నోవా కారుని దాచిన నిందితులు.. వాహనానికి ఉన్న గవర్నమెంట్ స్టిక్కర్‌ను సైతం తొలగించినట్లు సమాచారం. ఆ ఫామ్‌హౌస్‌లో సేద తీరిన తర్వాత, అక్కడి నుంచి నిందితులు…