MLA Rajasingh: ఒక పార్లమెంట్ సభ్యుడిని అరెస్ట్ చేయాలంటే ముందు నోటీసులు ఇవ్వాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. బండి సంజయ్ ని కలవడానికి వెళ్లనున్నట్లె తెలిపారు. అరెస్ట్ లకు బండి సంజయ్ భయపడరంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తప్పిదాలు ఎత్తిచూపినందుకే అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ అరెస్ట్ నీ ఖండిస్తున్నామంటూ నిప్పులు చెరిగారు. నేను వెళ్లి బండి సంజయ్ ని కలుస్తానని అన్నారు. బండి సంజయ్‌కు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారని రాజా సింగ్ అన్నారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌తో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని రాజాసింగ్ ఆరోపించారు.
కాగా, బండి సంజయ్ అరెస్టుపై ఆయన భార్య కూడా స్పందించారు. అరెస్టు సమయంలో ట్యాబ్లెట్లు వేసుకునేందుకు కూడా పోలీసులు సంజయ్‌కు సమయం ఇవ్వలేదని ఆరోపించారు. మంచి నీళ్లు కూడా తాగనివ్వడం లేదన్నారు. తన భర్త పట్ల పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారని తెలిపింది. కనీసం ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదన్నారు. అరెస్టు సమయంలో, అతని ముఖంపై కూడా గాయమైంది. సంజయ్ తన తల్లి చిన్న పూజలో పాల్గొనలేదని చెప్పాడు. అల్లుడు, కూతురు కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్నారని అపర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను ఎంతగా వేడుకున్నా పోలీసులు వినలేదని అన్నారు.
Read alsdo: Anil Kumar Yadav: వైసీపీలో టికెట్ రానివాళ్లే టీడీపీలోకి..!
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ను బీజేపీ లీగల్ సెల్ దాఖలు చేసింది. బండి సంజయ్ పై బొమ్మల రామారం పోలీసుల లీగల్ ప్రొసీడింగ్స్ కు రంగం సిద్దం చేసింది. బండి సంజయ్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయనున్నారు పోలీసులు. బండి సంజయ్ కు 41 సి.అర్.పిసి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయనున్నారు. అనంతరం ఇక్కడి నుండి బండి సంజయ్ ను వరంగల్ కు తరలించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మంగళవారం రాత్రి కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Anil Kumar Yadav: వైసీపీలో టికెట్ రానివాళ్లే టీడీపీలోకి..!