KA Paul: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ ఓట్లు మీకే వేసుకోండి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ ఓట్లు మీకే వేసుకోండి- కేఏ పాల్
- కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా- కేఏ పాల్
- నేను సీఎం అవుతాను.. నా సత్తా ఏంటో ఇప్పుడున్న వాళ్లకు తెలుసు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ ఓట్లు మీకే వేసుకోండని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తాను సీఎం అవుతానన్నారు. తన సత్తా ఏంటో ఇప్పుడున్న వాళ్లకు తెలుసని కేఏ పాల్ తెలిపారు. ఇప్పుడున్న వాళ్ళు వందల కోట్లు ఖర్చుపెట్టి లక్షల కోట్లు దోచుకున్నారు.. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. ఆయన మాటలతో వందల మందిని బలి చేశారని పేర్కొన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటీసీలు వేరే పార్టీ తరఫున పోటీ చేయకండి.. పార్టీలకు అతీతంగా ఏకగ్రీవం చేసుకోండని సూచించారు.
Read Also: Adani Group: అదానీ గ్రూప్ కీలక నిర్ణయం.. విల్మర్‌తోజాయింట్ వెంచర్‌కు గుడ్ బై..
Also Read
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో
- Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ - ట్రావెల్స్ బస్సు ఢీ.. 15 మందికి గాయాలు..!
చాలా మంది కులాన్ని వాడుకొని పార్టీలు లాభం పొందారు.. బీసీలను రెండు మూడు కులాల వారు అనగదొక్కారని కేఏ పాల్ తెలిపారు. రెడ్డిలు 12 మంది సీఎంలు అయ్యారని అన్నారు. కేసీఆర్ పేరు మీద లేదా పార్టీ మీద పోటీ చేద్దామనుకునే వారు వారికంటే దరిద్రులు ఇంకా ఎవరు లేరని చెప్పారు. కేసీఆర్ లక్షల కోట్ల ఆస్తులు సంపాదించారని కేఏ పాల్ వెల్లడించారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి కేఏ పాల్ కౌంటర్ ఇచ్చారు. పూలమ్మి.. పాలమ్మి అంత సంపాదించారా అని నిలదీశారు. ఇదిలా ఉంటే.. హైడ్రా పెద్ద డ్రామా అని ఆరోపించారు. రేవంత్, కేసీఆర్ తోడు దొంగలు అని దుయ్యబట్టారు. కేటీఆర్, రేవంత్ కొట్టుకోవడం.. తిట్టుకోవడం పెద్ద డ్రామానేనని కేఏ పాల్ అన్నారు.
Read Also: Kejriwal Vs LG: అతిషిని తాత్కాలిక సీఎం అనడంపై వీకే.సక్సేనా అభ్యంతరం.. సీఎంకు లేఖ
మరోవైపు.. అల్లు అర్జున్ ఎవరో తనకు తెలియదని.. ఆయన పేరు కూడా తెలియదన్నారు. చిరంజీవి, కృష్ణ తెలుసని చెప్పారు. పర్మిషన్ లేనప్పుడు అల్లు అర్జున్ను థియేటర్ లోపలికి ఎందుకు పంపారు.. ఆ హత్యలు మీకు భాగం లేదా అని కేఏ పాల్ ప్రశ్నించారు. ప్రజాశాంతి కండువాలు కప్పుకోవాలి.. తన ఫోటో పెట్టుకుని తిరగండని అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా గెలవండని కేఏ పాల్ తెలిపారు. రూ. 10 పెట్టి ప్రజాశాంతి పార్టీ సభ్యత్వం తీసుకోండని ప్రజలకు చెప్పారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!