Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
- చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి సమీక్ష
- అవసరమైతే హైదరాబాద్‌కు తరలించి వైద్యం
- రిమ్స్‌లో 150 పడకల MCH కేంద్రం నిర్మాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదిలాబాద్ రిమ్స్ (RIMS) ఆసుపత్రిలో చోటుచేసుకున్న విషాదకర అగ్నిప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట ప్రకటించింది. మృతి చెందిన పిల్లల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. బాధితుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు.
మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు.. అధికారులకు ఆదేశాలు
ఈ ప్రమాదంలో గాయపడి ఆదిలాబాద్‌లోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులతో మాట్లాడి సమీక్షించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు. అవసరమైతే చిన్నారులను వెంటనే రాజధాని హైదరాబాద్‌లోని పెద్ద ఆసుపత్రులకు తరలించి, అత్యుత్తమ వైద్యం అందించేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
యుద్ధప్రాతిపదికన 150 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణం
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఎదురవ్వకుండా, తల్లీపిల్లల వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో 150 పడకల సామర్థ్యంతో కూడిన నూతన మాతా శిశు ఆరోగ్య కేంద్రం (MCH) నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. అత్యాధునిక మౌలిక వసతులు, అధునాతన వైద్య పరికరాలతో ఈ కేంద్రాన్ని వీలైనంత త్వరగా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!