AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు నగరంలోని పూలే బొమ్మ సెంటర్ వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పేద ప్రజలకు శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ వైభవంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానం ద్వారా ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల సమయంలో కాలువకట్ట ప్రాంతంలో నివాసముంటున్న పేదలు తమకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇప్పించాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణను కోరగా, ఆయన ఇచ్చిన మాట ప్రకారం దీనిని నెరవేర్చారు.
కాలువకట్ట ప్రాంతంలో దాదాపు 22.31 ఎకరాల్లో కొన్ని దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేద ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి నారాయణ ప్రత్యేక చొరవ చూపారు. ఈ ప్రక్రియలో ఎదురైన సమస్యలను దాటేందుకు ఐదు వేర్వేరు ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసి, కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేయించారు. ఆ విధంగా ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత, సుమారు 600 కోట్ల రూపాయల విలువైన 939 శాశ్వత ఇళ్ల పట్టాలను సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో పేదలకు అందజేశారు.
Also Read
- Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
- Rapthadu Attack: రాప్తాడు ఘటన.. గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలింపు..
- Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
- Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
ఈ నిర్ణయంతో కాలువకట్ట నివాసితుల దశాబ్దాల కలను ప్రభుత్వం నెరవేర్చినట్లయింది. నెల్లూరు సిటీ పరిధిలో పేదల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఈ సందర్భంగా ప్రతినిధులు తెలిపారు. ఇప్పటివరకు నెల్లూరు నగర వ్యాప్తంగా 58 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సుమారు 900 కోట్ల రూపాయల విలువైన 2600 శాశ్వత ఇళ్ల పట్టాలను నిరుపేదలకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం అందించిన ఈ శాశ్వత హక్కుల ద్వారా పేదల కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండాయని, ఇది వారికి ఆర్థిక భద్రతను, సామాజిక గౌరవాన్ని కల్పిస్తుందని అధికారులు, నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!