కేబీఆర్ ఘటనపై నటి చౌరాసియా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పటిలాగే కేబీఆర్ పార్క్ లో వాకింగ్ కి వెళ్ళానని.. పార్క్ నుంచి బయటకు వస్తుంటే… ఒక వ్యక్తి తనపై దాడి చేశాడని తెలిపింది చౌరాసియా. తన మొబైల్ ఫోన్, డైమండ్ రింగ్ లాక్కోవడానికి ప్రయత్నించాడని.. అప్పుడే తన మొహం పై గుద్దాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన దగ్గర డబ్బులు లేవు… ఫోన్ పే చేస్తాను… నెంబర్ చెప్పమని అడిగానని… అదే టైం లో తాను రెండు సార్లు 100 కి డయల్ చేసానని వెల్లడించింది.
నేను 100 కి డయల్ చేయడం చూసి.. తనను పొదల్లోకి తోసాడు… పెద్ద బండరాయి తన తలపై వేయబోయాడని పేర్కొంది.
తాను పక్కకు తప్పుకుని… వాడి ప్రైవేట్ పార్ట్ పై తన కాలితో తన్నానని వెల్లడించింది. ఆ తర్వాత గోడ దూకి తప్పించుకుని రోడ్డుపైకి వచ్చానన్నారు. కొంతమంది నా చుట్టూ వచ్చి చేరారు… అది గమనించి వాడు పారిపోయాడని తెలిపింది. నేను అతడిని చూస్తే గుర్తుపడతాను… 22 నుంచి 25 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. దొంగతనం కోసమే వచ్చినట్టు అనిపించింది… దాడి తర్వాత అఘాయిత్యానికి ప్రయత్నించాడని తెలిపింది చౌరాసియా.