సాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో లాంఛ్ చేసిన స్మార్ట్‌ఫోన్లు ఎంతగా పాపులర్ అయ్యాయో అందరికి తెలిసిందే. సాంసంగ్ ఎఫ్ సిరీస్‌లో మరో మొబైల్ లాంఛ్ చేయబోతోంది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో లాంఛ్ చేయబోతోంది. ఇందులో 6,000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్, 50MP కెమెరా లాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయి. జూన్ 22న సాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 లాంఛ్ చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌లో టీజర్ కనిపించింది. దీంతో డిజైన్‌కు సంబంధించిన సమాచారం బయటికి వచ్చింది. డిజైన్‌తో పాటు కొన్ని ఫీచర్లు…