భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగోతోంది. ఆటోమొబైల్ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో ఈవీలను మార్కెట్ లోకి తీసుకొస్తు్న్నాయి. తాజాగా మోంట్రా ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ ట్రక్, మోంట్రా రైనోను సెప్టెంబర్ 28న భారత మార్కెట్ లో విడుదల చేసింది. మోంట్రా ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ ట్రక్కు, మోంట్రా రైనో 5538 EV 4×2 TT ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ట్రక్కును ఫిక్స్‌డ్ బ్యాటరీతో రూ. 1.15 కోట్ల ఎక్స్-షోరూమ్…
ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీలు ఈవీలను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహన తయారీదారు కైనెటిక్ ఇ-లూనా ప్రైమ్‌ను ప్రారంభించింది. కైనెటిక్ గ్రీన్ మార్కెట్లో ఇ-లూనా ప్రైమ్‌ను విడుదల చేసింది. తయారీదారు ఈ మోపెడ్‌ను విస్తృత శ్రేణి ఫీచర్లతో అందిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మారుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన ఇ-లూనా ప్రైమ్ వినియోగదారులకు…
హోండా కంపెనీ బైకులకు మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. క్వాలిటీ, ఫీచర్లు వాహనదారులను అట్రాక్ట్ చేస్తుంటాయి. తాజాగా హోండా మోటార్ హోండా CB350C ప్రత్యేక ఎడిషన్ భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. స్పెషల్ ఎడిషన్ మోటార్ సైకిల్ లో స్పెషల్ ఎడిషన్ స్టిక్కర్లు, వివిధ భాగాలపై కొత్త చారల గ్రాఫిక్స్ ఉన్నాయి. వెనుక గ్రాబ్ రైల్ కూడా క్రోమ్-ఫినిష్ చేయబడింది. సీటు…
దేశంలో సాధారణ వాణిజ్య విభాగంలోని వాహనాలతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఈవీ వాహనాలను తీసుకొస్తున్నాయి. యూలర్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ మినీ ట్రక్కును విడుదల చేసింది. భారత మార్కెట్లో యూలర్ టర్బో EV 1000 ను విడుదల చేసింది. ఈ మినీ ఎలక్ట్రిక్ ట్రక్కును కళ్లు చెదిరే ఫీచర్లతో విడుదల చేశారు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, యూలర్ కొత్త ట్రక్కు అనేక వినూత్న లక్షణాలను కలిగి ఉంది.…
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేమీ ఫలించలేదు. దీంతో ట్రంప్‌నకు సహనం నశించింది. ఎన్ని సార్లు చెప్పినా పుతిన్ మాట వినడం లేదని కోపం కట్టలు తెంచికొచ్చినట్లుంది.
జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి 2025లో భారతదేశంలో తన కొత్త బైక్ కవాసకి వెర్సిస్ 1100 ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్ 1100cc విభాగంలో అందుబాటులో ఉంది. ఈ బైక్ యువతను ఎక్కువగా ఆకర్షణను కలిగిస్తోంది. శక్తివంతమైన ఇంజిన్, అధిక సామర్థ్యం, డిజైన్ లోనూ చాలా వినూత్నతలతో కవాసకి వెర్సిస్ 1100 భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది.
భారతదేశంలోని ఎలక్ట్రిక్ బైక్ ప్రియులకు శుభవార్త..! ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ X ఎలక్ట్రిక్ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ బైక్ టీజర్‌ను ఓలా తాజాగా విడుదల చేసింది. అధికారిక లాంచ్ రేపు (ఫిబ్రవరి 5, 2025)న జరగనుంది. అయితే.. ఈ ఎలక్ట్రిక్ బైక్ కు సంబంధించిన ప్రత్యేక ఫీచర్లపై ఓ నజర్ వేసేద్దాం.
హనుమకొండలో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు.
హనుమకొండ జిల్లా హయగ్రీవ గ్రౌండ్లో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాగరాజు, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. వరంగల్‌కి 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది ప్రభుత్వం.
ప్రజాభవన్‌లో మంత్రి సీతక్క జెండా ఊపి 25 సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భార్యభర్తలు రోజంతా పనిచేసినా.. సాయంత్రం భార్య మాత్రమే ఇంట్లో పని ఎందుకు చేయాలి.. ఇద్దరూ చేయాల్సిందేనని అన్నారు. మహిళా సంఘాలకు లోన్ భీమా పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 17 రకాల వ్యాపారాలతో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం.. నాణ్యత, మంచి రుచితో ఆరోగ్యకరమైన చేపల వంటకాలు తయారు చేయండని సూచించారు.