Sarfaraz Khan: ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఫ్రాంచైజీలకు గట్టి సందేశం పంపాడు ముంబై బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్–B మ్యాచ్‌లో హర్యానాతో జరిగిన మ్యాచ్ లో సర్ఫరాజ్ కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. చివరకు అతడు 25 బంతుల్లో 64 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ 9 ఫోర్లు, 3 సిక్సులు బాదుతూ హర్యానా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ముఖ్యంగా ఎడమచేతి స్పిన్నర్ ఇషాంత్ భరద్వాజ్‌పై విరుచుకపడ్డాడు. గత ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని సర్ఫరాజ్‌కు ఇది సరైన సమయంలో వచ్చిన మంచి ఇన్నింగ్స్.
మరోవైపు ఈ మ్యాచ్‌లో మరో హీరోగా నిలిచాడు యశస్వి జైస్వాల్. ముంబై తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ సీజన్‌లో రెండోసారి మాత్రమే ఆడుతున్న జైస్వాల్.. 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేస్తూ అద్భుత సెంచరీ నమోదు చేశాడు. 48 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసాడు జైస్వాల్. అతడి ఇన్నింగ్స్ కారణంగా ముంబై కేవలం 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఇది ఈ టోర్నీలో రెండో అతిపెద్ద విజయవంతమైన చేజ్‌గా ముంబై రికార్డులకెక్కింది.
BJP: ప్రధాని మోడీని ‘‘అంతం’’ చేయడమే లక్ష్యమా..? కాంగ్రెస్ ‘‘ఓట్ చోరీ’’ ర్యాలీలో విద్వేష వ్యాఖ్యలు..
23 ఏళ్ల జైస్వాల్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరఫున సాధించిన తొలి సెంచరీ ఇదే. మొత్తంగా ఇది అతడి టీ20 కెరీర్‌లో నాలుగో శతకం. 120 ప్రొఫెషనల్ టీ20 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు ఎక్కువగా పవర్ హిట్టింగ్‌పై కాకుండా టైమింగ్, ప్లేస్‌మెంట్‌పై ఆధారపడ్డాడు. 16 ఫోర్లు, ఒక్క సిక్స్ తో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంతకుముందు జైస్వాల్ భారత జట్టు తరఫున నేపాల్‌పై, అలాగే ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున రెండు టీ20 సెంచరీలు నమోదు చేశాడు. 2024 టీ20 వరల్డ్‌కప్ విజేత భారత జట్టులో రిజర్వ్ ఓపెనర్‌గా ఉన్నప్పటికీ, గత ఏడాది కాలంగా టీ20 అంతర్జాతీయ జట్టులో చోటు దక్కలేదు. టెస్టుల్లో స్థిరంగా ఉన్న జైస్వాల్‌కు ఈ ప్రదర్శన, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కూడా మళ్లీ అవకాశాలు దక్కేలా ఉన్నాయి.