ఆపిల్ ప్రొడక్ట్స్ కు వరల్డ్ వైడ్ గా ఫుల్ క్రేజ్ ఉంటుంది. క్వాలిటీ, భద్రతాపరమైన ఫీచర్లు ఉండడంతో యాపిల్ ఐఫోన్స్, వాచ్ లు, ల్యాప్ టాప్ లు హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. కొత్త ప్రొడక్ట్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతుందంటే చాలు షాపుల ముందు బారులు తీరుతుంటారు. మీరు ఈ మధ్య ఆపిల్ ల్యాప్ టాప్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో బంపరాఫర్ అందుబాటులో ఉంది. Apple MacBook Air M1 ల్యాప్ టాప్ పై ఏకంగా రూ. 28 వేల డిస్కౌంట్ ప్రకటించింది. ప్రీమియం ల్యాప్ టాప్ పై ఇంతకంటే బెస్ట్ డీల్ ఉండదేమో ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.
Also Read:Adulterated Ghee in Atreyapuram Putharekulu: ఆత్రేయపురం పూతరేకుల్లో కల్తీ నెయ్యి..! గుట్టు రట్టు!!
Apple MacBook Air M1 ల్యాప్ టాప్ పై 30 డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 92,900గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 64,990కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. Apple MacBook Air M1 లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 గంటల బ్యాటరీ లైఫ్ ని ఇస్తుంది. ఇది ఆపిల్ M1 చిప్‌సెట్‌ను కలిగి ఉంది, ఇది 8 కోర్ CPUతో వస్తుంది. ఇది మునుపటి తరం కంటే 3.5 రెట్లు మెరుగైన పనితీరును అందిస్తుంది.
Also Read:GAMA Awards 2025 : త్వరలో 5వ ఎడిషన్ గామా అవార్డ్స్
ఈ ల్యాప్ టాప్ లో 8GB RAM అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ 13.3-అంగుళాల రెటినా డిస్ప్లేతో వస్తుంది. ఈ పరికరం 256GB స్టోరేజ్ కలిగి ఉంది. దీనిని 2TB వరకు విస్తరించుకోవచ్చు. కీబోర్డ్ బ్యాక్‌లిట్‌తో వస్తుంది. దీనికి 720P ఫేస్‌టైమ్ HD కెమెరా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో 49.9Wh బ్యాటరీ ఉంది. దానితో పాటు 30W USB-C పవర్ అడాప్టర్ వస్తుంది.