ఫిబ్రవరి 16, 2025న GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ 2025, 5వ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్ దుబాయ్‌లోని మైత్రి ఫార్మ్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దుబాయ్‌లోని 500 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. వీరితో పాటు తెలుగు కళా, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. వినూత్నంగా ఈ గ్రాండ్ రివీల్ ఈవెంట్ చేశారు. ఈ వేడుకలో ఈవెంట్ డేట్ అండ్ వెన్యూ సహా జ్యూరీ కమిటీని అధికారికంగా ప్రకటించారు. GAMA అవార్డ్స్ 2025, 5వ ఎడిషన్ తేదీ (జూన్ 7, 2025) దుబాయ్ షార్జా ఎక్స్పో సెంటర్లో నిర్వహించబోతున్నారు. ఇక జ్యూరీ చైర్ పర్సన్స్ ప్రముఖ సినీ దర్శకుడు ఏ. కోదండ రామిరెడ్డి , ప్రముఖ సంగీత దర్శకుడు కోటి , ప్రముఖ సినీ దర్శకుడు బి. గోపాల్ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు GAMA అవార్ద్స్ బహుకరించబడతాయి.