Ind Vs Zim: జింబాబ్వే గడ్డపై ఆ దేశ జట్టుతో టీమిండియా నేడు రెండో వన్డే ఆడనుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. రెండో వన్డేలోనూ టీమిండియా ఫేవరేట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమైన నేపథ్యంలో ఈ వన్డేలో అతడు ఓపెనింగ్‌కు వస్తాడా లేదా మిడిలార్డర్లోనే…
Team India Record: జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మేరకు టీమిండియా ఒకే ఏడాదిలో ఈ ఘనత సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్‌ను 10 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. అప్పుడు భారత ఓపెనర్లు 197 పరుగుల టార్గెట్‌ను వికెట్ కోల్పోకుండా ఛేదించారు. ఇప్పుడు జింబాబ్వేపై 192 పరుగుల టార్గెట్‌ను కూడా వికెట్లేమీ కోల్పోకుండా ఛేజ్ చేసి గెలిపించారు.…
Ind Vs Zim: హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 190 పరుగుల విజయ లక్ష్యాన్ని ఊదిపడేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలో 3 వికెట్లు తీసి జింబాబ్వేను కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో 190 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఒక్క వికెట్…
Ind Vs Zim: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు.. తర్వాత పట్టు సడలించారు. దీంతో జింబాబ్వే టెయిలెండర్లు రాణించారు. సుదీర్ఘ విరామం అనంతరం రీఎంట్రీ ఇచ్చిన దీపక్ చాహర్ తొలి మ్యాచ్‌లోనే సత్తా…
IND Vs ZIM: ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియాలో మరో మార్పు చోటు చేసుకుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన చేసింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలియజేసింది. ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతుండగా వాషింగ్టన్ సుందర్ భుజానికి గాయమైంది. ఆగస్టు 10న ఓల్డ్ ట్రాఫోర్డులో లాంక్షైర్కు ఆడుతూ ఓ మ్యాచ్‌లో డైవ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అతడు జింబాబ్వే టూర్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం సుందర్ రిహాబిలిటేషన్ కోసం బెంగళూరులోని…
Zimbabwe: ప్రస్తుతం టీమిండియా వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతోంది. ఈనెల 18 నుంచి జింబాబ్వే గడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే జింబాబ్వే ఇటీవల జోరు మీద కనిపిస్తోంది. బంగ్లాదేశ్ జట్టుపై టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకుని తాము బలహీనం కాదని టీమిండియాకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జింబాబ్వే ఆల్‌రౌండర్ ఇన్నోసెంట్ కియా టీమిండియాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. తాము భారత జట్టుకు పోటీ ఇవ్వడం కాదని… చుక్కలు చూపిస్తామని ధీమా…
బంగ్లాదేశ్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్ ర్యాన్ బర్ల్ అదిరిపోయే రీతిలో బ్యాటింగ్ చేశాడు. ఒకే ఓవర్ లో 5 సిక్సులు, ఓ ఫోర్ బాది మొత్తంగా 34 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. సెన్సేషనల్ బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు.
ఆగస్టులో శ్రీలంక వేదికగా ఆసియా కప్ 2022 టోర్నీ జరగనుంది. అయితే ఇదే సమయంలో జింబాబ్వేలో మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా పర్యటించాల్సి ఉంది. ఒకే సమయంలో రెండు పర్యటనలు ఉండటంతో ఆసియా కప్‌కు రోహిత్ శర్మ సారథ్యంలోని సీనియర్ల జట్టును, జింబాబ్వేకు జూనియర్ల జట్టును పంపించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు ఆసియా కప్‌లో పాల్గొనే టీమ్‌కు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా.. జింబాబ్వే పర్యటనకు వెళ్లే బీ టీమ్‌కు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.…
క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం మరోసారి కలకలం సృష్టిస్తోంది.. జింబాబ్వే జట్టు కెప్టెన్‌గా, ఆ జట్టు తరఫున అత్యధిక శతకాలు(17) బాదిన స్టార్ క్రికెటర్‌గా రికార్డులు సృష్టించిన జింబాబ్వే జట్టు మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ పై ఐసీసీ వేటు వేసింది.. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డానంటూ ఒప్పుకున్న టేలర్‌పై ఐసీసీ బ్యాన్ విధిస్తున్నట్టు ప్రకటించింది.. ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్‌లో మూడున్నరేళ్లు బ్యాన్ విధించగా.. ఇక, డోప్ టెస్ట్‌లో విఫలమైనందుకు ఒక నెల సస్పెన్షన్‌ను కూడా విధించింది.…
సౌతాఫ్రికాలో వెలుగు చూసినా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచాన్నిచుట్టేసే పనిలోపడిపోయింది.. ఇప్పటికే భారత్‌లో కూడా ఈ కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూడగా.. తాజా, మరో రెండు కేసులు పాజిటివ్‌గా తేలాయి.. ఈ నెల 4వ తేదీన జింబాబ్వే నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారించారు.. ఇక, అప్రమత్తమైన అధికారులు.. అతడు కలిసినవారిని ట్రేస్ చేశారు.. వారి నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. ఈ నేపథ్యంలో మరో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా…