South Africa Zimbabwe Match Cancelled Due To Rain: క్రికెట్ వరల్డ్‌లో ఉన్న అత్యంత బలమైన జట్లలో సౌతాఫ్రికా ఒకటి. లీగ్ మ్యాచెస్‌లో ఈ జట్టు సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. రికార్డుల పరంగానే కాదు.. దురదృష్టపరంగానూ ఈ జట్టుని మించిన మరకొటి లేదు. ప్రధానమైన టోర్నీల్లో గెలుపు అంచులదాకా.. వెనక్కి తిరిగి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిణామమే టీ20 వరల్డ్‌కప్‌లో రిపీట్ అయ్యింది. వరుణుడు కాటెయ్యడం వల్ల.. గెలవాల్సిన మ్యాచ్‌ని వదలుకోవాల్సి వచ్చింది. సూపర్-12లో భాగంగా అక్టోబర్ 24వ తేదీన జింబాబ్వే, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా దాదాపు గెలుపు అంచుల దాకా వెళ్లింది. కానీ, సరిగ్గా అదే సమయంలో వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో.. మ్యాచ్ రద్దైంది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు వరుణుడు ఆటంకం కలిగించడంతో.. 9 ఓవర్లకే ఈ మ్యాచ్‌ని కుదిరించారు. అనంతరం పరిస్థితులు బాగుండటంతో.. మ్యాచ్ ఆడేందుకు అనుమతి ఇచ్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు.. 9 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. అనంతరం 81 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. ఆరంభం నుంచే విజృంభించింది. అయితే.. 1.1 ఓవర్ల తర్వాత మళ్లీ వర్షం ప్రారంభం కావడంతో.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 7 ఓవర్లలో 64 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికాకు నిర్దేశించారు. అప్పుడు మళ్లీ బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. అదే జోరుని కొనసాగించింది. ఓపెనర్ డీకాక్ విధ్వంసకర ఇన్నింగ్స్ (18 బంతుల్లో 47) కారణంగా.. మూడు ఓవర్లలోనే సౌతాఫ్రికా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 51 పరుగులు చేసింది. మరో 13 పరుగులు చేస్తే.. మ్యాచ్ సౌతాఫ్రికాదే!
అలాంటి సమయంలో వరుణుడు మళ్లీ షాకిచ్చింది. ఎంతసేపటికీ వర్షం ఆగట్లేదు. దీంతో చేసేదేమీ లేక.. అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసేశారు. ఫలితంగా.. ఇరు జట్లకి చెరో పాయింట్ దక్కింది. గెలుపుకి కొంత దూరంలో ఉన్న టైంలో వరుణుడు అడ్డుకోవడంతో.. సౌతాఫ్రికా ఆటగాళ్లు ముఖాలన్నీ మాడిపోయాయి. అటు.. క్రీడాభిమానులు సౌతాఫ్రికాకి ఇదెక్కడ ఇదెక్కడి దురదృష్టంరా బాబు అని సోషల్ మీడియాలో కామెంట్లు చేసుకుంటున్నారు.