T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ లాంటి అగ్ర జట్టును ఓడించిన జింబాబ్వేకు పసికూన నెదర్లాండ్స్ షాక్ ఇచ్చింది. అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేపై నెదర్లాండ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే బ్యాటింగ్ ఎంచుకోగా 19.2 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. సికిందర్ రజా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడు 24 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 40 పరుగులు చేశాడు. సీన్ విలియమ్స్…
టీ-20 ప్రపంచ కప్ సూపర్ -15 గ్రూప్ మ్యాచ్‌లో జింబాబ్వేపై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ భరిత పోరులో ఎట్టకేలకు బంగ్లాదేశ్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.
PAK Vs ZIM: టీ20 ప్రపంచకప్‌లో గురువారం సంచలనం నమోదైంది. బలమైన పాకిస్థాన్ జట్టుపై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో జింబాబ్వే అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అటు జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ డాంబుడ్జో కూడా స్వయంగా ట్వీట్ చేశారు. క్రెగ్ ఇర్విన్ సారథ్యంలోని జింబాబ్వే జట్టును అభినందిస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపించారు. ఈ దఫా తమ దేశానికి ఫేక్ మిస్టర్ బీన్‌ను కాకుండా రియల్ మిస్టర్ బీన్‌ను పంపాలంటూ ఎద్దేవా చేశారు. దీంతో…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై జింబాబ్వే సంచలన విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజా చరిత్ర సృష్టించాడు. ఒక ఏడాదిలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. సికిందర్ రజా ఈ ఏడాది ఏడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. పాకిస్థాన్ జట్టును జింబాబ్వే ఓడించింది. పెర్త్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే చారిత్రక విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యాన్ని కూడా పాకిస్థాన్ ఛేదించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో బాగానే ఆడిన జింబాబ్వే అనంతరం పాక్ బౌలర్ల ధాటికి భారీ స్కోరు సాధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు…
Ryan Burl: అంతర్జాతీయ క్రికెట్‌లో జింబాబ్వే దశాబ్దాలుగా ఆడుతున్నా ఆ జట్టు ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో జింబాబ్వే ఆటగాళ్లకు స్పాన్సర్లు కూడా కరువయ్యారు. దీంతో ఆటగాళ్లు తమ క్రికెట్ కిట్ల కోసం బిక్కుబిక్కుమంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియాపై చెలరేగిన జింబాబ్వే లెగ్ స్పిన్నర్ ర్యాన్ బర్ల్‌కు 15 నెలలుగా స్పాన్సర్లు లేరు. మరోవైపు సొంతంగా క్రికెట్ కిట్‌ను కొనే స్థోమత కూడా లేదు. షూస్ చిరిగిపోతే కొత్తవి కొనడానికి డబ్బుల్లేని దుస్థితిని ర్యాన్ బర్ల్…
AUS Vs ZIM: ఎన్నో సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నా పసికూనగానే మిగిలిపోయిన జింబాబ్వే ఎట్టకేలకు చరిత్ర సృష్టించింది. అది కూడా ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించి సంచలనం నమోదు చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై ఏ ఫార్మాట్లో అయినా జింబాబ్వేకు ఇదే తొలి విజయం కావడం విశేషం. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలైనప్పటికీ మూడో వన్డేలో జింబాబ్వే ఆటగాళ్లు తెగించి ఆడారు. దీంతో విజయం సొంతం చేసుకుని ఆస్ట్రేలియా లాంటి మేటి…
India Vs Zimbabwe: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో కూడా టీమిండియానే టాస్ గెలిచింది. ఈ సందర్భంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి ఫీల్డింగ్ తీసుకునేందుకే మొగ్గు చూపించాడు. తొలివన్డేలో కూడా టీమిండియా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా జింబాబ్వేను 189 పరుగులకే భారత బౌలర్లు కట్టడి చేశారు. అదే తరహాలో రెండో వన్డేలో కూడా తక్కువ పరుగులకే ప్రత్యర్థిని కట్టడి చేసేలా టీమిండియా ప్రణాళికలు రచించింది. ఇప్పటికే మూడు…