Backward China: కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకవని ఒక సామెత ఉంది. అదిప్పుడు చైనాకి సరిగ్గా సరిపోతుంది. ఆ దేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయినా ఏం లాభం? అంత గొప్ప పేరు కూడా కరోనా ముందు లోకువ అయిపోయింది. జీరో కొవిడ్ పాలసీ కారణంగా చైనా ఎకానమీ 50 ఏళ్లు వెనక్కి వెళ్లింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎదురుతన్నటం కూడా దీనికి మరో ప్రధాన కారణంగా నిలిచింది.
చైనా జీరో కొవిడ్ విధానంపై ఆ దేశ పౌరుల నుంచి నిరసన వ్యక్తం అవుతుండడంతో ఆంక్షలు సడలించాలని డ్రాగన్ సర్కారు చూస్తోంది. ఆ దేశం జీరో కొవిడ్ విధానాన్ని సులభతరం చేయడానికి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. జీరో-కొవిడ్ పాలసీని ఎత్తేస్తే లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని పరిశోధకులు చెబుతున్నారు.
డ్రాగన్ దేశంలో జీరో కొవిడ్ విధానాన్ని కఠినంగా అమలు చేయడంపై మొదలైన ఆందోళనలు మరింత విస్తరిస్తున్నాయి. దేశంలోని బీజింగ్ సహా పలు నగరాల్లో ప్రజలు పెద్దఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. దేశమంతటా దాదాపు 40,000 కొత్త కొవిడ్ కేసులు నమోదవడంతో అధికారులు ఆంక్షలను కఠినతరం చేశారు.
Anti-Covid protests flare up in China: కోవిడ్ లాక్ డౌన్ వ్యతిరేకంగా చైనా దేశంలో తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు, యువత పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ దిగిపోవాలని, చైనా కమ్యూనిస్ట్ పార్టీ దిగిపోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రజలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. చైనాలో నిరసన కార్యక్రమాలు జరగడం చాలా చాలా అరుదు. అటువంటిది అక్కడ ‘జీరో కోవిడ్’ విధానం పాటిస్తుండటంతో ప్రజలు…
చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ దేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జిన్‌పింగ్ పాలన పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. జిన్‌పింగ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని చైనాలోని హైడియన్ జిల్లాలో బ్యానర్లు వెలిశాయి.