US Institute Predicts China Could See Over A Million COVID Deaths Through 2023: కొంతకాలంగా చైనాలో కొవిడ్ కేసులు గణనీయంగా పెరగడంతో.. అక్కడి ప్రభుత్వం జీకో కొవిడ్ ఆంక్షల్ని అమలు చేసింది. అయితే.. ఆ ఆంక్షలు మరీ కఠినంగా ఉండటం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో.. వాటిని సడలించాల్సిందిగా కోరుతూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో మరో దారి లేక.. జీరో కొవిడ్ ఆంక్షల్ని ప్రభుత్వం సడలించింది. ఈ దెబ్బకు అక్కడ మళ్లీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని ఇలాగే వదిలేస్తే.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి చైనాలో కొవిడ్ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్’ (ఐహెచ్‌ఎంఈ) అంచనా వేసింది. అలాగే మరణాల సంఖ్య 3 లక్షలకు పైనే నమోదు కావొచ్చని.. 2023 చివరి నాటికి ఆ మరణాల సంఖ్య 10 లక్షలకు పైన చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆ సంస్థ పేర్కొంది.
IRCTC Contractor Fined: రూ. 5 ఎక్కువగా వసూలు చేశాడు.. ఒక లక్ష ఫైన్ కట్టాడు
ఈ ఐహెచ్‌ఎంఈ డైరెక్టర్ క్రిస్ట్‌ఫర్ ముర్రే చైనా కొవిడ్ పరిస్థితి గురించి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ కల్లా చైనా జనాభాలో మూడింట ఒకవంతు ప్రజలు ఈ కరోనా వైరస్ బారిన పడతారని కుండబద్దలు కొట్టాడు. అంతేకాదు.. కేవలం జీరో కొవిడ్ విధానంతో ఈ వైరస్ వ్యాప్తిని అదుపు చేయలేరని, ఇతర వేరియెంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ అధికంగా వ్యాప్తి చెందుతోందని ఆయన పేర్కొన్నాడు. మరోవైపు.. చైనాలో 16.4 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని, దీంతో కొవిడ్ పర్యవసనాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్‌లో గ్లోబల్ హెల్త్ సీనియర్ ప్రతినిధి యాన్‌జోంగ్ హువాంగ్ బాంబ్ పేల్చాడు. అలాగే.. చైనాలో 80 ఏళ్లు, ఆపైబడిన వారు 8 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలున్నారని, వారికి ఇప్పటిదాకా టీకాలు వేయలేదని, వారిపై కూడా ఈ కొవిడ్ ప్రభావం చూపడం ఖాయమని చెప్పాడు. అటు.. చైనా జాతీయ కమిషన్ ఈ కరోనా పరిస్థితిని ఎదుర్కోవడం కోసం టీకాల ప్రక్రియను ముమ్మరం చేశామని.. వెంటిలేటర్లు, అవసరమైన మందులను కూడా నిల్వ ఉంచామని స్పష్టం చేసింది.
West Bengal Strange Lights: ఆకాశంలో వింత.. స్పేస్‌షిప్ అంటూ జనాలు గిలిగింత