Up to 70 per cent of Shanghai population infected with Covid: చైనాలో కరోనా వైరస్ ఏ స్థాయిలో విలయతాండవం చేస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ కొవిడ్ కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా.. జీరో కొవిడ్ ఆంక్షల్ని ఎత్తివేసినప్పటి నుంచి అక్కడ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రీసెంట్‌గానే ఓ సర్వే.. చైనాలో రోజుకి 9 వేల మంది కొవిడ్ కారణంగా మృత్యువాత పడుతున్నారని వెల్లడించింది. దీన్ని బట్టి అక్కడ కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డిసెంబర్‌లోని మొదటి 20 రోజుల్లోనే.. 250 మిలియన్లకు పైగా ఈ వైరస్ బారిన పడ్డారు.
MLA Chinnaiah: మరో వివాదంలో ఎమ్మెల్యే చిన్నయ్య.. టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి
ఇప్పుడు తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. చైనాలోని షాంఘై నగరంలో దాదాపు 70 మందికి పైగా కొవిడ్ సోకి ఉండొచ్చని సీనియర్ వైద్యులు పేర్కొంటున్నారు. షాంఘైలోని ఆసుపత్రులు మొత్తం కొవిడ్ రోగులతో నిండిపోతున్నాయని తెలిపారు. అక్కడి పరిస్థితుల గురించి షాంఘై కోవిడ్ అడ్వైజరీ ప్యానెల్ నిపుణుడు చెన్ ఎర్జన్ మాట్లాడుతూ.. షాంఘైలో మొత్తం 2.5 కోట్ల మంది ప్రజలున్నారని, వారిలో చాలామందికి ఈ వైరస్ సోకి ఉంటుందని తెలిపారు. ఈ వైరస్ షాంఘైలో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది కాబట్టి, జనాభాలో 70% మందికి కొవిడ్ సోకి ఉండొచ్చని అంచనా వేస్తున్నామన్నారు. రుయిజిన్ ఆసుపత్రిలో ప్రతి రోజు 1600 ఎమర్జెన్సీ అడ్మిషన్లు జరుగుతున్నాయని, అందులో 80 శాతం కోవిడ్ కేసులే ఉన్నాయని, రోజూ ఆసుపత్రికి వందకు పైగా ఆంబులెన్సులు వస్తున్నాయని కుండబద్దలు కొట్టారు. 65 ఏళ్లు దాటిన వారంతా ఎమర్జెన్సీ విభాగంలో చేరుతున్నారని చెప్పారు.
Waltair Veerayya: ఆ టైంలో ఇబ్బంది పడ్డా.. శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్
ఒక్క షాంఘైలోనే కాదు.. బీజింగ్, తియాంజిన్, చాంగ్‌కింగ్, గాంగ్‌జూ మొదలైన నగరాల్లోనూ కొవిడ్ కేసులు తారాస్థాయికి చేరుకున్నాయని అక్కడి అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో కరోనా ఇన్‌ఫెక్షన్లు మరింత అధికంగా ఉంటాయని వెల్లడిస్తున్నారు. అయితే.. చైనాలో కరోనా కేసులు విపరీతంగా నమోదు అవుతున్నా, అక్కడి ప్రభుత్వం మాత్రం అందుకు సంబంధించిన వివరాల్ని బయటపెట్టట్లేదు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వాస్తవ గణాంకాలను చైనా వెల్లడించాలని, దేశంలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉందో తెలియజేయాలని కోరింది. వైరస్‌కు కట్టడిచేసేందుకు అవసరమైతే అంతర్జాతీయంగా సహకారం అందిస్తామని చెప్పింది.
Japan Offer: టోక్యోని వీడండి.. లక్షలు కొట్టేయండి.. జపాన్ ప్రభుత్వం ఆఫర్