రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. రష్యన్ సేనలు కీవ్‌లోకి ప్రవేశించాయని, కీవ్ ఎయిర్‌పోర్ట్ తో పాటు పలు కీలక ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ కీలక ప్రకటన చేశారు. కీవ్ తమ ఆధీనంలోనే ఉందని, రష్యా సేనలు ఆక్రమించుకుంటున్నాయని వస్తున్న మాటల్లో నిజం లేదని జెలెస్కీ స్పష్టం చేశారు. తమ చివరి పోరాటం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్‌ను రష్యా చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తామని అన్నారు. కీవ్‌తో పాటు ప్రధాన నగరాలు సైతం ఉక్రెయిన్ ఆధీనంలోనే ఉన్నట్టు జెలెస్కీ పేర్కొన్నారు.
Read: Ukrainian Hero: రష్యన్ ట్యాంకులను అడ్డుకున్న ఒకే ఒక్కడు…
తమ మిత్ర దేశాలు ఆయుధాల సహాయం చేస్తున్నాయని జెలెస్కీ ప్రకటించారు. సైనిక దాడి మాత్రమే చేస్తున్నామని, సైనిక స్థావరాలపై మాత్రమే దాడులు చేస్తున్నామని చెప్పిన రష్యా, ఆ మాటను తప్పి ఇప్పుడు పౌరులు నివశించే అపార్ట్‌మెంటులపై కూడా దాడులు చేస్తున్నారని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. రష్యాను నిలువరించేందుకు సాయం చేయాలని ప్రపంచదేశాలను అభ్యర్ధించారు.