వైఎస్ జగన్ భద్రత వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ.. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.. ఈ లంచ్ మోషన్ పిటిషన్ ను వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేశారు..
BS Yeddyurappa Security: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) ఇటీవల బెదిరింపు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కి కేంద్రం భద్రతను పెంచింది. ఇప్పటి వరకు ఉన్న వై కేటగిరి భద్రతను పెంచుతూ ‘జెడ్ కేటగిరి’గా అప్‌గ్రేడ్ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
Tamil Nadu BJP chief Annamalai to get Z-category security: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడికి కేంద్ర భారీ సెక్యూరిటీని కల్పించింది. ఏకంగా జెడ్-కేటగిరి భద్రతను కల్పించనుంది. అన్నామలై రక్షణగా మొత్తం 33 మంది సీఆర్పీఎఫ్ కమాండోలను నియమించనున్నారు. ఇంటెలిజెన్స్ నివేదిక తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అన్నామలైకి గతంలో వై-కేటగిరి సెక్యూరిటీ ఉంది. అయితే ఇటీవల కాలంలో తమిళనాడు రాజకీయాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు అన్నామలై.