S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కి కేంద్రం భద్రతను పెంచింది. ఇప్పటి వరకు ఉన్న వై కేటగిరి భద్రతను పెంచుతూ ‘జెడ్ కేటగిరి’గా అప్‌గ్రేడ్ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
Read Also: Al-Nukhba Force: నరరూప రాక్షకులు వీళ్లు.. హమాస్ ‘అల్-నుఖ్బా’ ఫోర్స్ గురించి కీలక విషయాలు..
గతంలో జైశంకర్‌కి ‘వై’ కేటగిరి భద్రత ఉండేది. ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంంలో భద్రతను మూడవ అత్యున్నత స్థాయి భద్రతకు అప్‌గ్రేడ్ చేశారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో పలు ఉగ్రసంస్థల నుంచి ముఖ్యంగా ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి జైశంకర్ కి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం భద్రతను పెంచినట్లుగా సమాచారం.
ప్రస్తుతం జైశంకర్ భద్రతను వై కేటగిరి కింద ఢిల్లీ పోలీసులు చూస్తున్నారు. ఇకపై జెడ్ కేటగిరి కింది ఢిల్లీ పోలీసులు అందిస్తున్న భద్రతా బాధ్యతలను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(పీఆర్పీఎఫ్) తీసుకుంటుంది. జెడ్ కేటగిరి కింది సాయుధులైన 14-15 మంది కమాండోలు 24 గంటలు జైశంకర్‌కి సెక్యూరిటీ ఇస్తారు.