Tamil Nadu BJP chief Annamalai to get Z-category security: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడికి కేంద్ర భారీ సెక్యూరిటీని కల్పించింది. ఏకంగా జెడ్-కేటగిరి భద్రతను కల్పించనుంది. అన్నామలై రక్షణగా మొత్తం 33 మంది సీఆర్పీఎఫ్ కమాండోలను నియమించనున్నారు. ఇంటెలిజెన్స్ నివేదిక తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అన్నామలైకి గతంలో వై-కేటగిరి సెక్యూరిటీ ఉంది. అయితే ఇటీవల కాలంలో తమిళనాడు రాజకీయాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు అన్నామలై. అధికార డీఎంకే పార్టీ తప్పిదాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించాడు. కోయంబత్తూర్ బాంబు పేలుడు ఘటనలో తమిళనాడు డీఎంకే ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి ఉగ్రవాద ఘటనపై డీఎంకే ప్రభుత్వం మెతకవైఖరి అవలంభిస్తుందంటూ విమర్శించారు.
Read Also: Karnataka High Court: తండ్రి అప్పును కొడుకు తీర్చాల్సిందే.. హైకోర్టు సంచలన తీర్పు..
ఈ నేపథ్యంలో మావోయిస్టులు, తీవ్రవాదుల నుంచి అన్నామలైకి బెదిరింపులు వస్తున్నాయి. దీనిపై ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం అన్నామలైకి భద్రతను అప్ గ్రేడ్ చేసింది. ఇటీవల కాలంలో తమిళనాడులో పలు ప్రాంతాల్లో ఇస్లామిక్ టెర్రరిజం స్లీపర్ సెల్స్ పెరుగుతున్నారు. నిషేధిత పీఎఫ్ఐ కార్యకలాపాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నాయకుడికి భద్రతను కట్టుదిట్టం చేశారు.